
తెలంగాణ ఉద్యమకారులంటే పదవుల ఎరకు లొంగేవారనే భావనతో చంద్రబాబు- టీఆర్‌ఎస్ ఏర్పాటు కాకుండా ఉండటానికి చేయని ప్రయత్నం లేదు.

ఐరాస స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఆరవ లక్ష్యం- ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత 2030 నాటికి అందించాలనేది. ఈ లక్ష్య సాధన కోసం పునరంకితమవుదాం. జల సంరక్షణే… మన సంరక్షణ!

కరోనాతో రాష్ట్రాలకు రాష్ట్రాలు కుదేలవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రజల సహకారంతో సుస్థిరమైన బడ్జెట్‌ను రూపొందించుకోగలిగింది. అన్ని వర్గాల సంక్షేమం, …

తెలంగాణ.. అరవయ్యేండ్ల ఆకాంక్ష! సుదీర్ఘ పోరాటం. త్యాగాల చరితం. అనేక దశల్లో మలుపులు తిరిగిన ఉద్యమం. ఇందులో ఎన్నో మజిలీలు. ఉత్కంఠ రేపిన రోజులు.

కల కనేందుకు కూడా ఇతరులు సాహసించని కాలంలో కలలోనూ, మెలకువలోనూ తెలంగాణనే స్వప్నించినవాడు కేసీఆర్. అనుకున్నది సాధించి ప్రజలకు కానుకగా ఇచ్చాడు.

తెలంగాణ రాష్ట్రం 14.2 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకింది. రూ.2.28 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబడటంతోనే మన నిధులను మనం సాకారం చేసుకున్నట్లు స్పష్టమవుతున్నది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ గత ఆరేండ్లలో రైతులలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. రుణమాఫీ నుంచి మొదలై, నిరంతర ఉచిత విద్యుత్తు, ప్రతి ఎకరానికీ కృష్ణా, గోదావరి జలాల సాగునీరు అందిస్తున్నారు.

రైతుకు వెన్నుదన్నుగా నిలిచి రైతు తన కష్టానికి తనే ధర నిర్ణయించుకోవాలన్న ఉద్దేశంతో రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రైతువేదికలను నిర్మిస్తున్నది. ఇవి కేవలం భవనాలు కావు. రైతాంగం భవిష్యత్ నిర్మాణ వేదికలు.

దేశ రైతాంగ జీవితాలపై, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ప్రభుత్వం అన్ని నియమాలనూ కాదని నియంతృత్వ ధోరణిని అనుసరించింది. భారత పార్లమెంటు ఎగువసభలో సభ్యుల గౌరవాన్ని,హక్కులను ఏమాత్రం పట్టించుకోలేదు.

ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన పాలకులు తమ పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే సోయి లేకుండా ప్రభుత్వాలు నడిపారు. ఇలాంటి పాలనా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పు లు తీసుకురావాల్సిన అవసరం ఉందని గ్రహించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
Please contribute generously to the BRS Party.