Author Archives: BRSpartyonline

పచ్చని రాష్ట్రంలో ప్రాణికోటి
‘జంగిల్ బచావో- జంగిల్ బడావో’ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలతో పనిచేస్తున్నది. హరితహారం ఇప్పటికే ఐదు విడతలు పూర్తికాగా, ఆరో విడత కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నారు.

బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చే పంటలు పండించాలి
రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు.

దేశానికే తెలంగాణ తలమానికం
గత ఆరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్వితీయ విజయాలను సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలిచిందని పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

విద్యుత్తు బిల్లును కేంద్ర సర్కారు ఉపసంహరించుకోవాలి
విద్యుత్ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లు రైతులకు, పేదలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టంచేశారు.

ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ కాన్ బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

స్వరాష్ట్ర కల సాకారమైన రోజు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు చిన్న పిల్ల నుంచి పండు ముసలి వరకు జాతి మొత్తం సంతోష పడిన రోజు. సబ్బండ వర్ణాలు సంబరపడిన రోజు జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సంబంరం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలందరీలో నూతన ఉత్సాహాన్ని నింపిన రోజు.





