
ప్రస్తుత మున్సిపాలిటీల్లోని మౌలికవసతులు, పౌర సౌకర్యాలపై సంపూర్ణ నివేదిక రూపలక్పనతోపాటు, ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రోడ్‌మ్యాప్ రూపొందించుకొని, ఆ దిశగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వల్పకాలంలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు.

రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుపక్షపాత ప్రభుత్వం. అందుకే టీఆర్‌ఎస్‌కు ప్రజలు తిరుగులేని విజయాలందిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, వారికి మెరుగైన సులభతరమైన సేవలు అందించేందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు.

ఎన్నిక ఏదైనా.. ఒక వర్గానికో.. ఒక కులానికో ప్రాధాన్యమివ్వకుండా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ .. పీడిత వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన నాయకుడిగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు.
పట్టణాల్లో భవననిర్మాణాల అనుమతుల కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లు తేలితే.. సహించబోమని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం జోరందుకున్నది. పల్లె ప్రగతి స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతున్నది. కాలనీల్లో అంతర్గత రోడ్లతోపాటు డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం వేగవంతమవుతున్నది.

‘రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి.. వచ్చే నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవు.. ఇక మా దృష్టంతా అభివృద్ధిపైనే’ అని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

పల్లెప్రగతి స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతికి అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు.

పట్టణ రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు వచ్చే నెల 4వ తేదీవరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.
Please contribute generously to the BRS Party.