
వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా విపత్తునుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నందున ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ పోదామని పేర్కొన్నారు.
తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది.

పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. నూతన పంచాయతీరాజ్‌చట్టంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు, అభివృద్ధి ఫలాలు ప్రజల ముగింటకు చేరాయి.

తమ సమస్యలపై రైతులు చేస్తున్న ఆందోళనలకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. రైతుల సమస్యలను సానుకూల దృక్పథంతో చూసి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.

తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి.. యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు శాశ్వత స్మృతిచిహ్నాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది.

వ్యవసాయా నికి 24 గంటల ఉచిత కరెంటు, పంట పెట్టబడి సాయం, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తూ నేను రైతును అంటూ అన్నదాతలు గల్లా ఎగురేసి చెప్పుకునే ధీమా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ అన్నారు.

పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజయ్య తీవ్రంగా ఖండించారు.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతికదాడులకు ఏమాత్రం చోటులేదని స్పష్టంచేశారు.

నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి సొంతింటి కల నెరవేరబోతున్నది. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చూపిన చొరవ మరో ఇంట వెలుగులు నింపనున్నది.

తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్ ఏ ఎజెండాతో పదమూడేండ్లు నిర్విరామ పోరాటం చేసిందో ఆ ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం నిర్విరామ కృషి కొనసాగుతున్నది.
Please contribute generously to the BRS Party.