
తెలంగాణ ధనిక రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం గుర్తించిన నేపథ్యంలో, తమ ప్రభుత్వానికి రుణపరపతిని పెంచుకునేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీతిఆయోగ్ ప్రతినిధులను కోరారు.

చెరువు పూడిక తీత పనులను కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు పారదర్శకంగా చేపట్టాలి. చేసే పనిలో నాణ్యత పాటించాలి అని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ సదుపాయాలు, యంత్ర పరికరాలు సమకూర్చాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇతర శాఖలకు ఆదర్శంగా నిలవాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులు, ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేయాలని మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు.

పార్టీ ప్లీనరీ, బహిరంగ సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది.

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశించారు.

చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు, భూగర్భజలాలు పెరిగి వెనకటి రోజులు వస్తాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో రైతుల కల సాకారమవుతుందని, చెరువుల పునరుద్ధరణ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
Please contribute generously to the BRS Party.