
బతుకమ్మ చీరెల పంపిణీకి విశేష స్పందన లభిస్తున్నది. మూడో రోజైన బుధవారం కూడా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చీరెలు అందుకున్నారు.

బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం రెండోరోజూ అట్టహాసంగా సాగింది. మంగళవారం పలువురు మంత్రులు ఆయా జిల్లాల్లో చీరెలను పంపిణీ చేశారు.

ఆడపడుచులకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సారెను తీసుకోవడానికి ఉదయం నుంచే మహిళలు పెద్దఎత్తున పంపిణీ కేంద్రాలకు తరలివచ్చి, బారులు తీరారు. తమ వద్దనున్న అధారాలను చూపించి చీరెలు అందుకున్నారు.

కష్టపడి సాధించుకున్న తెలంగాణ క్షీర విప్లవం దిశగా అడుగులు వేయాలని, పాడిపంటల తెలంగాణగా రాష్ట్రం ఆవిర్భవించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

మిషన్ భగీరథ దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

రైతు సంక్షేమంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తు రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

పథకాల పేరుతో దోచుకుని దాచుకునే సంస్కృతి కాంగ్రెస్‌కే చెల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రైతు సమితులను ఏర్పాటు చేయటం దేశంలోనే విప్లవాత్మక చర్య. దుక్కిదున్ని పంట పండించే రైతే ధర నిర్ణయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
Please contribute generously to the BRS Party.