
రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఇదేం పద్ధతి? అంటూ నిలదీశాడు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడిసాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కేంద్రంలో ఉన్నది కామన్‌మ్యాన్ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ, కార్పొరేట్ కంపెనీలను మేపుతున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బొక్కబొర్లా పడిన నడ్డా.. తెలంగాణకు వచ్చి సినిమా డైలాగులు చెప్తే ఎవరూ నమ్మరని అన్నారు.

దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది.

ఒకప్పుడు సర్కార్ దవాఖానలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. ఉన్నతవర్గాలవారు ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి.

స్వతంత్ర భారతావనిలో విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలుస్తున్నదని, రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అనేక రంగాల్లో విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.

తెలంగాణలో మార్పును చూపెట్టినట్టే.. దేశంలో పరివర్తన తెచ్చేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఏర్పాటైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు
Please contribute generously to the BRS Party.