Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి రండి

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆహ్వానించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి బుధవారం ముంబైలో సైరస్ మిస్త్రీతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జూన్ 12న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ ఆండ్ సెల్ఫ్ సర్టిఫేకేషన్ సిస్టం(టీఎస్‌ఐపాస్) కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రి కోరారు. దీనికి సైరస్ మిస్త్రీ సానుకూలంగా స్పందించారు.

KTR met Tata Chairman Misthri

-టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ -టీ హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగస్వామ్యం కావాలని వినతి -తమ హృదయంలో తెలంగాణకు ప్రత్యేక స్థానముందన్న మిస్త్రీ ఈ సందర్భంగా టీఎస్‌ఐపాస్ విశేషాలను సైరస్ మిస్త్రీకి మంత్రులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి వివరించిన మంత్రి కేటీఆర్ టీహబ్, టాస్క్ వంటి విశిష్ట కార్యక్రమాల్లో టాటా గ్రూప్ భాగస్వామం కావాలని కోరారు. తాము ఏర్పాటు చేయబోయే టీహబ్ ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు. దీనిపై సైరస్ మిస్త్రీ స్పందిస్తూ టాటా అధినేతల హృదయంలో తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక స్థానముందని అన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టులను తెలంగాణలో చేపట్టేందుకు ఆసక్తి చూపించారు. దీంతో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకులు ఎఫ్‌సీ కోహ్లీ స్మారకార్థం హైదరాబాద్ ట్రిబుల్‌ఐటీలో నూతన బ్లాక్ నిర్మిస్తామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.