Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణకు న్యాయం చేయండి

-కాజీపేటలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుచేయండి
-లోక్‌సభలో ఎంపీ నామా నాగేశ్వర్‌రావు డిమాండ్

‌ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం న్యాయంచేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో గళమెత్తారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఏపీవిభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకా రం ఇప్పటికైనా కాజీపేటలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని నెలకొల్పాలని కోరారు. చట్ట ప్ర కారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రావటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రానికి కేంద్ర విద్యాసంస్థలేవీ?: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
ఐఐఎం, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతోపాటు కేంద్రీయ విద్యాలయాలను తెలంగాణలో ఏర్పాటుచేయటంలో కేంద్రం తాత్సారం చేస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఇటీవల పలు రాష్ర్టాలకు విద్యాసంస్థలను మంజూరుచేసిందని, అందు లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. విద్యావిధానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటుచేయాలని, జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. మాతృభాషలో విద్యాబోధన చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలను వాటి పరిధిలోని ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన దయనీయంగా ఉన్నదని, వీటి మెరుగుకు కేం ద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

తాండూరు రైతుల సమస్య తీర్చండి: ఎంపీ రంజిత్‌రెడ్డి
చేవెళ్ల నియోజకవర్గంలోని తాండూరు సాయిపూర్‌ రైతులు పశువులను మేపుకోవడానికి రోడ్డు అండర్‌ బ్రిడ్జిని (ఆర్‌యూ బీ) తెరవాలని ఎంపీ రంజిత్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు. మంగళవారం రైల్వే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తాండూరు పట్టణ శివారు ప్రాంతం లో చాలామంది పేద రైతులు.. వ్యవసాయం, పశుసంపదపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వీరంతా పశువులను మేపడానికి ఆర్‌యూబీ నుంచి వెళ్లేవారని, ఇటీవల ఈ మార్గం మూసివేయడంతో దాదాపు 4 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. పశువులకు పశుగ్రాసం సరిగా అందక ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు.

మేం నీళ్లిచ్చాం.. మీరు నిధులివ్వండి
-మిషన్‌ భగీరథపై కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి వినతి
మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రజలకు శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నామని, ఈ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ప్రశంసలు కాదు నిధులు కూడా అందించాలని విజ్ఞప్తిచేశారు. మంగళవారం రాజ్యసభలో జలమంత్రిత్వశాఖ పనితీరుపై జరిగిన చర్చలో తెలంగాణలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని అందించినందుకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశంసలు కురిపించారు. ఇంటింటికీ నల్లా నీటిని అం దించడంలో తెలంగాణ ప్రభుత్వం బా గా పనిచేసిందని కేంద్రమంత్రి కితాబిచ్చారని ఎర్రబెల్లి చెప్పారు. షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎర్రబెల్లి.. నీతి ఆయోగ్‌ సిఫార్సు మేరకు కేంద్రం ని ధులిస్తే బాగుంటుందని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.