అయ్యప్ప దర్శనంకోసం తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి కేరళ ప్రభుత్వం సంతోషపూర్వక అంగీకారం తెలిపింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీకే అబ్‌దురూబ్ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి భవన నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. గత నెలలో కేరళ వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని కలిసి శబరిమలలో భవననిర్మాణాన్ని గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

-శబరిమలలో ఐదు ఎకరాలు కేటాయింపు -సీఎం కేసీఆర్‌ను కలిసి అంగీకారం తెలిపిన కేరళ విద్యాశాఖ మంత్రి సచివాలయంలో అబ్‌దురూబ్‌కు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ ఆయనతో అనేక విషయాలను చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పోచారంశ్రీనివాసరెడ్డి, చందూలాల్, హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్యగౌడ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంఓ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, తెలుగు రీజియన్ మళయాళి అసోసియేషన్స్ సమాఖ్య అధ్యక్షుడు లిబ్బీ బెంజమిన్ పాల్గొన్నారు.