Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

స్వరాష్ట్రంలోనే విద్యుత్తుకాంతులు

-జానాకు ఓటేస్తే ఒరిగేదేం లేదు..బీజేపీకి వేస్తే ఉచిత కరెంటు ఊస్టే
-ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదంతో బరిలో నోముల భగత్
‌ -మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడి
-మాడ్గులపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం

తెలంగాణ వచ్చినంకనే రాష్ర్టంలో విద్యుత్తు వెలుగులు నిండాయని ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం అభంగాపురంలో మంగళవారం నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నోముల నర్సింహయ్య మరణం దుదృష్టకరమని, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో బరిలోకి దిగిన భగత్‌ను ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి ఓటు వేస్తే ఒరిగేది ఏమిలేదని, ఆయన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 30 ఏండ్లపాటు పెండింగ్‌లో ఉన్న వరద కాలువను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. బీజేపీకి ఓటు వేస్తే ఉచిత కరెంట్‌ను నిలిపేసి వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారని చెప్పారు.

ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు రెట్టింపు చేసిన విషయాన్ని గుర్తించాలని కోరారు. గ్రామాలన్నీ ఏకమై భగత్‌కు ఓటు వేయాలని కోరారు. శక్తియుక్తులు ఉన్న నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌ను గెలిపించి, సీఎం కేసీఆర్‌కు కానుకగా పం పించాలని పిలుపునిచ్చారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. నిరంతర కరెంట్‌, కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తన తండ్రి నర్సింహయ్యను గెలిపించిన విధంగానే తనను గెలిపిస్తే.. తమ్ముడిలాగా, కొడుకులాగా మీ అందరికీ జీవితాంతం సేవ చేసుకుంటానని భగత్‌ పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. సాగర్‌ విజయవి హార్‌లో ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌ ప్రచారంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.