పాలనను ప్రజల ముంగిటకు తెచ్చి.. బంగారు తెలంగాణను నిర్మించడానికే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.
ప్రతి జిల్లా దేనికదే ప్రత్యేకతలున్న జిల్లాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజల యోగక్షేమాల దృక్కోణంలో చూస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు దీన్ని ఫ్యూడల్ మనస్తత్వంతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తదుపరి నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంటుందని సీఎం వెల్లడించారు.

