Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పాల సేకరణ లక్ష్యం చేరుకోవాలి

-ఎంపీ వినోద్‌కుమార్ పిలుపు

mp-vinod-released-new-year-calendar

కరీంనగర్ డెయిరీ యజమాన్యం ఐదు లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. సోమవారం స్థానిక డెయిరీలో క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల, పౌల్ట్రీ, మాంస ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఎన్‌సీడీఎస్ నిధుల నుంచి రూ.398 కోట్ల రుణాలను గొర్రెల పెంపకందారులకు అందించేందుకు కృషి చేస్తున్నామనీ, ఇందులో 20 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల భూనిర్వాసితులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణ సదుపాయం అందించాలని, పాడి ఉత్పత్తిని పెంచాలని డెయిరీ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు,

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.