Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నేతన్నలకు సురక్ష ప్రమాద భీమా

రాష్ట్ర మంత్రి కేటిఆర్ రక్షాబంధన్ కానుక సిరిసిల్ల లో 25 వేల మందికి చెకూరనున్న లబ్ది సొంతంగా ప్రీమియం చెల్లించనున్న మంత్రి

KTR 01

రాష్ట్ర పంచాయతి రాజ్ ,ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు రక్షాబంధన్ కానుక ప్రకటించారు. చేనేత కార్మికులందరికి భరోసా కల్పించేందుకు సురక్ష భీమా యోజన కింద ప్రమాద భీమా కల్పించనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్మికునికి 2 లక్షల భీమా సౌకర్యం లబిస్తుంది.ప్రమాద భీమా ప్రీమియం మొత్తం మంత్రి కేటీఆర్ సొంతంగా చెల్లిస్తారు. రక్షాబంధన్ నాటికి ప్రతి కార్మికుడికి భీమా సౌకర్యం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి బుధవారం అధికారులను ఆదేశించారు. ఈ పధకం ద్వారా సిరిసిల్ల నియోజకవర్గంలోని 25 వేల మందికి లబ్ది చేకూరనుంది.18 నుంచి 70 ఏళ్ల వయస్కులు ఈ భీమాయోజనకు అర్హులు. ఈ పధకం అమలుతో రూ.2 లక్షల భీమాతో పాటు శాశ్వత అంగవైకల్య భీమా లబిస్తుంది పాక్షిక అంగవైకల్యానికి గురైన వారికి రూ.లక్ష వరకు లబ్ది చేకూరనున్నది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటికే 20వేల మంది లబ్దిదారులను గుర్తించారు నియోజకవర్గ పరిధిలోని బ్యాంకర్లతో సమావేశమయ్యారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.