-కాంగ్రెస్, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలంతా గులాబీ గూటికి చేరిక -గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి -గులాబీ పార్టీనే గెలిపించుకుంటా మంటున్న ప్రజలు -నియోజకవర్గ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారాన్ని ప్రభంజనంలా కొనసాగిస్తున్నాయి. బొంరాసుపేట్ నుంచి ప్రచారం ప్రారంభించిన పట్నం నరేందర్‌రెడ్డికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తున్నది. నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను విడుదలచేసింది. పలు అభివృద్ధి పను లు చేసింది. అదే అంశాన్ని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ముఖ్య ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని బొంరాసుపేట్, కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్ మండలాల్లో ఎక్కడ ప్రచారం నిర్వహించినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు.
టీఆర్‌ఎస్ పార్టీకి వెల్లువలా మద్దతు
ఏ గ్రామానికి, ఏ తండాకు వెళ్లినా ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే సుమారు 30 గ్రామాల ప్రజలు మూకుమ్ముడిగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి అండగా నిలిచారు. సబ్బండ వర్గాల ప్రజలు ప్రచారంలో పాల్గొంటున్నారు. నరేందర్‌రెడ్డి యువతతోపాటు వృద్ధులు, మహిళలు ఇలా అందరినీ కలుస్తూ, పలుకరిస్తూ టీఆర్‌ఎస్ పార్టీకే ఓటేయాలని కోరుతున్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా సంక్షేమ పథకాల అమలుతోపాటు వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకే మా ఓటు అంటూ పట్నం నరేందర్‌రెడ్డికి జనం నీరాజనాలు పడుతున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి రూ.300 కోట్లు
వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. నియోజకవర్గ ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తున్న నాయకులకు బుద్ధి వచ్చేలా నియోజకవర్గానికి ఏడాది కాలంలో రూ.300 కోట్ల నిధులను విడుదల చేసి కొడంగల్ అభివృద్ధికి నాంది పలికారు. నియోజకవర్గంలో కొత్తగా తండాలతోపాటు 500 మించి జనాభాగల గ్రామాలను పంచాయతీలుగా మార్చారు. ఐదు మండలాల్లో కొత్తగా 56 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అదేవిధంగా కొడంగల్‌తోపాటు కోస్గిని మున్సిపాలిటీలుగా ఏర్పాటుచేసి, ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది. కొడంగల్‌లో బస్‌డిపోతోపాటు బస్టాండ్ నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదలచేసింది. కోస్గిలో ఇన్స్‌పెక్టర్ కార్యాలయంతోపాటు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. మద్దూరు బస్టాండ్‌కు రూ.60 లక్షలు, అన్ని మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్షలు విడుదల చేసింది. ఇవేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ భవనాలకు నిధులు మంజూరు చేసింది. మిషన్ కాకతీయలో 140 చెరువుల పునరుద్ధరణకు రూ.39 కోట్లు, దౌల్తాబాద్ మండలంలో మినీ ట్యాంకుబండ్ ఏర్పాటుకు రూ.7.14 కోట్లు, రైతుబంధు పథకంలో భాగంగా 37,810 మంది రైతులకు రూ.47 కోట్ల పెట్టుబడి సాయం అందించడంతోపాటు రూ.167 కోట్లతో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా తదితర పథకాలను ప్రధాన ప్రచార అస్ర్తాలుగా పట్నం నరేందర్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు
నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతోనే కొడంగల్ లో గులాబీ జెండా ఎగురడం పక్కా అని టీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయ ని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడం, సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమానికై ఎన్నో సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేయడంతో అభివృద్ధివైపే తాముంటా మంటూ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్‌ఎస్ పార్టీకే జైకొడుతున్నారు. ఇప్పటికే కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్, మద్దూర్ మండలాల జెడ్పీటీసీలతోపాటు ఎంపీపీలు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డిని తరిమికొట్టేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ఒక్కపైసా అభివృద్ధి చేయకుండా.. రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్న రేవంత్‌కు కొడంగల్ నియోజకవర్గంలో కాలం చెల్లినట్టేనంటున్నారు. రేవంత్‌రెడ్డి మా తండాకు ప్రచారానికి వస్తే తరిమికొడుతామని గిరిజన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వెనుకబడిన తండాలను పంచాయతీలుగా మార్చి, మా జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సార్‌కే మా ఓటంటూ మద్దతిస్తున్నారు.
తెప్ప తగలేసే ఆంధ్రాపార్టీలు
-2009లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు అయిపోగానే.. తన రిస్ట్ వాచ్‌లో టైం చూసుకొని తెలంగాణకు వెళ్లాలంటే వీసా తీసుకొని పోవలసి ఉంటుందని సీమాంధ్ర ప్రజలను వైయస్ రెచ్చగొట్టిన విషయం తెలిసిందే.
-2014లోనూ తెలంగాణలో పోలింగ్ అయిపోగానే.. సీమాంధ్రలో చంద్రబాబు తెలంగాణపై గొంతు చించుకొని మాట్లాడటమూ చూశాం.
-ఇపుడు 2018లో తెలంగాణలో
డిసెంబర్ 7 పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి 2019 ఏప్రిల్ దాకా సీమాంధ్రలో చంద్రబాబు తెలంగాణపై మరోసారి ఏమేమి ఆడిపోసుకుంటారో వేచి చూడాల్సిందే! పార్లమెంటులో ఏపీ హోదా కోసం మాత్రమే మాట్లాడి తెలంగాణ హామీలను పట్టించుకోని రాహుల్ కూడా బాబుకు తోడైతాడోమో కూడా చూడాల్సిందే!
-ఏరు దాటగానే తెప్ప తగలేసే ఆంధ్రా
పార్టీలు మనకెందుకు? అనే మౌలిక ప్రశ్న తెలంగాణ ఎన్నికల ఎజెండాగా మారి ప్రజల ముందుకు వస్తున్నది.
-ఫలితంగానే.. ఏరు దాటక ముందే చంద్రబాబు పని పట్టాలనే రాజకీయ చైతన్యం తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్నది.
ఓటరన్నా కాస్కో.. అధికారం అందేదా పోయేదా అళవికానివన్నీ అనేస్తరు ఇచ్చిన మాటేదని నిలదీస్తే నితిన్‌గడ్కరీ లెక్క నవ్విఊరుకుంటరు ఓటరన్నా.. జెర చూస్కో… అడుగకున్నా ఇస్తరట అప్పులన్నీ మాఫీ చేస్తరట రిజర్వ్‌బ్యాంకుకు రంధ్రమేసి రైతు ఇంట పోస్తరట ఓటరన్నా.. జెర కాస్కో…
భార్యా పిల్లల లెక్క పరాయోల్లను చూపిస్తరు డబ్బాపట్టి పెయింట్లేసి వేలకోట్లు జమేస్తరు ఓటరన్నా..గా కిటుకేందో అడుగాలె…
తప్పుడు పనులెన్నో బేషుగ్గా చేస్తరు చేతులకు బేడీలొచ్చేసరికి కక్షసాధింపని కాకిగోల చేస్తరు ఓటరన్నా.. ఓ కన్నేసి ఉండాలె..

