Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేంద్ర బలగాలను దింపైనా ఆర్డీఎస్ పనులు చేస్తాం

పనులు జరిగేందుకు బాబు సహకరించాలి: హరీశ్‌రావు

Harish Rao 02

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ పనులను కేంద్ర బలగాలను దింపైనా పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. పాలమూరు జిల్లాకు రావాల్సిన న్యాయమైన నీటివాటాను చంద్రబాబు అడ్డుకుంటున్నాడని ఆయన విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో హరీశ్ విలేకరులతో మాట్లాడారు.

సమైక్యరాష్ట్రంలో పాలమూరు తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆర్డీఎస్ నుండి జిల్లాకు రావాల్సిన నీటిని ఏపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు రెండు కళ్లు సీమాంధ్రవైపే ఉన్నాయని విమర్శించారు. పాలమూరు జిల్లా ప్రజలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి ఉన్నారని, ఇక నుంచి నష్టం జరిగితే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పారు. చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే ఆర్డీఎస్ పనులు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని కోరారు. విభజన చట్టం లో కూడా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉందని, వాస్తవానికి ఆర్డీఎస్ నుండి 16.9 టీఎంసీల నీళ్లు పాలమూరుకే దక్కాలని, కానీ ప్రతిసారి ఐదు టీఎంసీలే వస్తున్నాయని చెప్పారు. ఈ నీళ్లకోసం కేసీఆర్ పాదయాత్ర కూడా చేశారని గుర్తు చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఇరిగేషన్ శాఖలకు లేఖలు రాశామని అన్నారు. ఆర్డీఎస్ పనులను అడ్డుకోవడంపై సీడబ్ల్యుసీకి కూడా లేఖ రాశామని వివరించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.