Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటి

– సినిమాలకే పరిమితం కావద్దు: ముఖ్యమంత్రి కేసీఆర్ – సీఎంకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల కృతజ్ఞతలు

KCR 002 సినీరంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని, హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రెండువేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన సినిమాసిటీలో కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కావద్దని సూచించారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించి గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్ వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. సినిమాసిటీ ప్రకటనపై సీఎం కేసీఆర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఎన్ శంకర్ నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సినిమా సిటీలో హాలీవుడ్‌ను తలదన్నేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, దానికి దక్షిణ భారత సినీరంగ పెద్దలు, తెలుగు సినీపరిశ్రమ ప్రతినిధులను ఆహ్వానిస్తామన్నారు. ఆ తర్వాత ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొట్టారకర మాట్లాడుతూ సీఎం చంద్రశేఖర్‌రావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఆయన సినీరంగాన్ని ఎంతగా ఆదరిస్తారో అర్థమైందని ప్రశంసించారు. సినిమా సిటీ ప్రకటన అద్భుతమైనదని సినీ దర్శకుడు ఎన్‌ శంకర్ అన్నారు. హాలీవుడ్ స్టూడియోలకు కస్టోరియం హెడ్‌గా పనిచేస్త్తున్న ఉదయ్‌సింగ్ వంటి వారి సూచనలతో నిర్మాణం చేపట్టాలన్నారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచంలోనే అతి పెద్ద సినీ హబ్‌గా రాష్ట్రం మారుతుందని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ కమిటీ చైర్మన్ సీ కల్యాణ్ అన్నారు.

ఈ సందర్భంగా సీఎంకు ఇండియన్ సినిమా సెంటినరీ లోగోను బహూకరించారు. సౌత్‌ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శులు కాట్రగడ్డ ప్రసాద్, టీఏ అరుల్‌పాతి, కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు హెచ్‌డీ గంగరాజ్, కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కే నందకుమార్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు బీ శివరామకృష్ణ, తమిళ్ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు కే మురళీధరన్, ఇండియన్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్‌సింగ్, రెన్‌ట్రాక్ కార్పొరేషన్ ఎండీ ఏ రాజ్‌కుమార్ తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.