Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఎగరేద్దాం.. గులాబీ జెండా

-రేపు వాడవాడలా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ
-పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త పాల్గొనాలి
-కట్టుదిట్టంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సాగాలి
-కమిటీల్లో సామాజిక సమతూకం తప్పనిసరి
-శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు
-టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌


టీఆర్‌ఎస్‌ జెండా పండుగను గురువారం (సెప్టెంబర్‌ 2న) రాష్ట్రంలో మూలమూలలా ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, నగర పాలక సంస్థల మేయర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒకరూ జెండా పండుగలో భాగస్వాములయ్యేలా చూడాలని ఆదేశించారు. గురువారమే ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం జెండా పండుగ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్‌ నగర విసృ్తతి, జనాభా, భిన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వారంలోనే ప్రత్యేక సమావేశం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ, డివిజన్‌ కమిటీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం సమన్వయంతో ఈ కమిటీలు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

జెండా పండుగ తర్వాత వెంటనే పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ
-2 నుంచి 12 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు.
-12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం.
-20 తర్వాత జిల్లా కార్యవర్గాలు, అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకత్వం సమన్వయంతో ప్రకటన. -అనంతరం రాష్ట్ర కార్యవర్గాన్నిప్రకటించనున్న సీఎం కేసీఆర్‌.
-క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పార్టీ కమిటీల్లో చోటు.
-అన్ని స్థాయిల కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 51% ప్రాతినిథ్యం. లేకుంటే కమిటీలు చెల్లవు.
-సోషల్‌ మీడియా కమిటీలు ముందుగా మండల స్థాయిలో, తర్వాత గ్రామస్థాయిలో.. అన్ని కమిటీల్లో మహిళలకు తగిన భాగస్వామ్యం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.