Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలవాలి

-టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు సీఎం ఆశీస్సులు
-నేతల సమక్షంలో బీ ఫాం అందించిన కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దుబ్బాక ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు సూచించారు. బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను సోలిపేట సుజాత కలిసి ఆశీస్సులు తీసుకొన్నారు. ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సమక్షంలో కేసీఆర్‌ ఆమెకు బీఫాం అందజేశారు. పార్టీకోసం, ప్రజల కోసం పాటుపడాలని ఈ సందర్భంగా సూచించారు. సుజాత మాట్లాడుతూ దివంగత సోలిపేట రామలింగారెడ్డికి ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు తనకు కూడా అందించాలని ప్రజలను కోరారు. కేసీఆర్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానని చెప్పారు. సీఎం ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య, రాజమౌళి పంతులు తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.