Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కాంగ్రెస్‌కు ఓటేస్తే..మురికి కాల్వలో వేసినట్లే

-బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేయాలి -టీఎంయూ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

Harish Rao

మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సూచించిన జగ్గారెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చిందని, ఆంధ్రా బాబుల కొమ్ముకాస్తున్న జగ్గారెడ్డి డిపాజిట్లు కూడా గల్లంతు చేసి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) జిల్లా సర్వసభ్య సమావేశం సంఘం జిల్లా కన్వీనర్ పీ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్మికులను కోరారు. టీఎంయూను ఆదర్శ కార్మిక సంఘంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

తెలంగాణ కార్మికుల కోసం ప్రభుత్వం రూ.250 కోట్ల గ్రాంట్ విడుదల చేసిందని, మనల్ని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గ్రాంట్ ఇస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఆదాయం వచ్చే రూట్లలో ఆంధ్రా బస్సులు తిరుగుతూ, ఆదాయం రాని రూట్లలో తెలంగాణ బస్సులను నడుపుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ విభజన జరిగితేనే తెలంగాణ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.