-ప్రాజెక్టుల గురించి మీరు ఎంత మాట్లాడితే టీఆర్‌ఎస్‌కు అంత మేలు -పార్టీలో మీ ఉనికి కోసం ఇన్ని అబద్ధాలా? -తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లుతూ పైశాచిక ఆనందం -ఆరోపణలు నిరూపించు.. లేదంటే క్షమాపణ చెప్పు -కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి పై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు
ప్రాజెక్టుల గురించి ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టిందని, ఆ పార్టీ నాయకులు ప్రాజెక్టులపై ఎంత మాట్లాడితే టీఆర్‌ఎస్‌కు అంత మంచిదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు అవినీతి మరక అంటించి, పైశాచిక ఆనందం పొందేందుకు కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో సీఎం సీటుకోసం అనేకమంది కొట్టుకుంటున్నారని, అందులో ఆయన పేరు లేకపోవడంతో ఉనికి చాటుకునేందుకు.. సీఎం కేసీఆర్‌ను తిడితే పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశంతో సీనియర్ నాయకుడు అయిన ఆయన గల్లీ లీడర్‌గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు 200కు పైగా కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ హయాంలో ఎన్ని ఇండ్లకు తాగునీరిచ్చాం.. ఎన్ని ఎకరాలకు సాగునీరిచ్చాం.. ఆధారాలతో వస్తా.. మీ పదేండ్ల పాలనలో మీరేం చేశారో ఆధారాలతో రండి.. మీ ఆరోపణలపై మీకు నమ్మకం ఉంటే, చర్చకు రావాలి.. లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని జైపాల్‌రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు.
ప్రాజెక్టుల గురించి ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టిందని, ఆ పార్టీ నాయకులు ప్రాజెక్టులపై ఎంత మాట్లాడితే టీఆర్‌ఎస్‌కు అంత మంచిదని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కఇంటికైనా తాగునీరిచ్చిందా అం టూ కాంగ్రెస్‌నేత జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పసిపిల్లలు కూడా నవ్వుతారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో ఏ చేసిందో.. నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఏంచేశామో ప్రజలందరికీ తెలుసునని చె ప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5లక్షల ఎకరాలకు సాగునీరిస్తే.. టీఆర్‌ఎస్ సర్కారు 25 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చిందన్నారు. 15వేల గ్రా మాలకు నీరు అందిస్తున్నామని, 11లక్షల ఇండ్లకు నల్లాలు బిగిస్తున్నామని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తాజామాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కార్యదర్శి గట్టు రాంచందర్‌రావుతో కలిసి మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని, తాగు, సాగు నీరందించడంలో విఫలమయ్యామంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల పూర్తి వివరాలతోపాటు ఎన్ని ఇండ్లకు తాగునీరిచ్చాం.. ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చాం.. ఆధారాలతోవస్తా.. మీ పదేండ్ల పాలనలో మీరేం చేశారో ఆధారాలతో రండి.. మీ ఆరోపణలపై మీకు నమ్మకం ఉంటే, చర్చకు రావాలి.. లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని హరీశ్‌రావు.. జైపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. దేశంలోనే అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు అవినీతి మరక అంటించి, పైశాచిక ఆనందం పొందేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు అంతా అవినీతే కనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు. వయస్సులో పెద్దఅయి న జైపాల్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది అన్నారు. సీఎం సీటుకోసం కాంగ్రెస్‌లో చాలామంది కొట్టుకుంటున్నారని, అందులో తనపేరు లేకపోవడంతో ఉనికి చాటుకునేందుకు.. సీఎం కేసీఆర్‌ను తిడి తే పబ్లిసిటీ వస్తుందని సీనియర్ నాయకుడైన ఆయన గల్లీ లీడర్‌గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటమా! అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, రాష్ట్రంలో అసలు అవినీతికి తెరలేపిందే ఆ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నవరత్న కంపెనీలకే పనులు అప్పగించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో, సర్వే డిజైన్ల పేరుతో దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ నేతలదని ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని మీ కొత్తదోస్త్ చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు.
అంతా బహిరంగమే.. సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ బహిరంగ రహస్యమేనని, వాటికి సంబంధించిన ప్రతిఅంశం నిబంధనల ప్రకారమే జరిగిందని హరీశ్‌రావు చెప్పారు. ఈపీసీ విధానాన్ని రద్దుచేసి, దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎస్సెస్సార్ పద్ధతిని అనుసరించి పారదర్శకమైన వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. నాలుగేండ్లలో పూర్తిచేస్తామంటూ నాలుగు జిల్లాల్లో కొబ్బరికాయలు కొట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అతీగతీ లేకుండాపోయిందని, 2008 నుంచి 2012 వరకు రూ.1,481 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్, సర్వేల పేరిట తీసుకొని రూ. 150 కోట్ల పని కూడా చేయలేదని విమర్శించారు. పనులు ప్రారంభం కాకముందే నాలుగుసార్లు ప్రాజెక్టు అంచనాలు పెంచారని అన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరిట నాటిసీఎం వైఎస్.. తెలంగాణ నీటిని మళ్లిస్తుంటే జైపాల్‌రెడ్డి నోరుకూడా మెదపలేని విమర్శించారు. చనిపోయిన వారిపేరుతో కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేయించారని, ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో 200కు పైగా కేసులు వేశారని తెలిపారు.
కేంద్రమంత్రిగా తెలంగాణకు ఏం చేశావు.. జైపాల్‌రెడ్డి.. నువ్వు ఒక పెద్దనాయకుడిగా ఉన్నావ్.. కేంద్రమంత్రి పదవి చేశావ్.. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేశావా? కనీసం మహబూబ్‌నగర్, కల్వకుర్తిని పట్టించుకున్నావా? అని హరీశ్‌రావు నిలదీశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాలమూరుకు నీళ్లిచ్చి పచ్చగా మార్చిందని అన్నారు. జిల్లాలో ఎక్కడచూసినా సాగునీరు పారుతున్నదని, మత్తళ్లు దుంకుతూ పరవళ్లు తొక్కుతున్నదని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు జైపాల్‌రెడ్డి నయాపైసా కూడా లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, బట్టేబాజ్ పార్టీ ఎవరిదో తెలుసుకోవాలని హెచ్చరించారు. జైపాల్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి హరీశ్‌రావుతో చర్చకు ముందుకురావాలని సవాల్‌విసిరారు.

