Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కాంగ్రెస్‌ పార్టీ కావాలా? 24 గంటల కరెంట్‌ కావాలా?

-ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌కవర్‌ సీఎంలు మనకు అవసరమా?: కేటీఆర్‌
-కాకతీయ సామ్రాజ్యం సామంతరాజ్యం కావాలా?
-కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న కరెంట్‌ 5 గంటలే
-అక్కడ కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు చెంపలేసుకుంటున్నరు
-55 ఏండ్లు అధికారంలో ఉన్నా నీళ్లు, కరెంటియ్యలే వాళ్లు..
-సాగు, తాగునీరు, కరెంట్‌ లేని రోజులు మళ్లీ రావాలా?
-కాంగ్రెస్‌ పార్టీ కావాలా? 24 గంటల కరెంట్‌ కావాలా?
-తొమ్మిదన్నరేండ్లలో మేం కరెంట్‌, సాగు, తాగునీళ్లిచ్చినం..
-రాష్ట్రంలోని ముదిరాజ్‌లకు త్వరలో శుభవార్త చెప్పనున్నాం
-వికారాబాద్‌ రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు నెలలకు ఒకరు సీఎం కావడం ఖాయం.. ఐదేండ్లలో పది మంది సీఎంలు వస్తారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో ఎవరికి వారే సీఎం అభ్యర్థినంటూ ఫీల్‌ అవుతున్నారని చురకలంటించారు. సోమవారం పరిగి నియోజకవర్గ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డికి మద్దతుగా మం త్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి తో కలిసి మంత్రి కేటీఆర్‌ కుల్కచర్ల మండలకేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు.

కనుచూపు మేర కిక్కిరిసిన జనాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ నేతలు కొత్త పై జామాలు కుట్టించుకుంటుండ్రు. పెద్ద మనిషి జానారెడ్డి కూడా రెడీ అయితుండు. పోటీ చేయకున్నా సీఎం కానికే సోకు పడుతుండు. భట్టి విక్రమార్క సీఎం అంట.. రేటెంతరెడ్డి సీఎం అంట’ అని ఎద్దేవా చేశారు. ‘రేటెంతరె డ్డి ఆ పార్టీ టికెట్లు మొత్తం పైసలకు అమ్ముకున్నడు.. మొన్న ఓటుకు నోటు.. నిన్న సీటుకు రేటు.. రేపు అధికారమిస్తే ప్లాట్లు చేసి రాష్ట్రాన్ని అమ్మేయడా? ఎవరి చేతుల్లో పడితే వాళ్ల చేతుల్లో రాష్ట్రాన్నిపెడదామా? ఓ ఇంటికి పిల్లనిచ్చే టైంలో పిలగాడు రేవంత్‌రెడ్డిలాగా దొంగనా? లంగనా? అని ఆలోచించే మనం.. రాష్ట్రాన్ని ఎవడికిపడితే వాడికి రాసిచ్చేద్దామా ఆలోచించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవర్‌ సీఎంలు మనకవసరమా? కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంతం కావాలా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన పాపానికి అక్క డి రైతులు చెంపలేసుకుంటున్నారని, అక్కడ 5 గంటల కరెంట్‌ మాత్రమే ఇస్తున్నదని, బోర్లు, చెరువులు ఎండిపోవడంతో రైతులు మొసళ్లను సబ్‌స్టేషన్లకు తీసుకువచ్చి ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. నాడు కరెంట్‌లేక అర్ధరాత్రి పొలాల వద్ద పడిగాపులు, విద్యుత్తు షాక్‌ లు, పాములు, తేళ్లు కుట్టి రైతుల మరణాలు, చెరువులు ఎండిపోయి, ఊర్లు వల్లకాడు అయి న పరిస్థితి నెలకొని ఉండేదని, ఆ దయనీయ పరిస్థితులు మళ్లీ రావాలా? అనేది ఆలోచించాలని కోరారు.

55 ఏండ్లు అధికారంలో ఉన్న కాం గ్రెస్‌ కరెంట్‌, నీళ్లు ఇవ్వలేదని చెప్పా రు. కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడు ఊర్లళ్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల తర్వాత స్నానాలు చేయడానికి కరెంట్‌ ఇవ్వాలని బతిమిలాడిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 52 కిలోల బక్కపలచని ఒక్క కేసీఆర్‌ను ఖతం చేసేందు కు ఢిల్లీ నుంచి ఎంతో మంది వస్తున్నారని, ఎంతమంది వచ్చినా భయంలేదని.. సింహం సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. ముదిరాజ్‌లు త్వరలో శుభవార్త వింటారని తెలిపారు.

మూడోసారి గెలవగానే 4 కొత్త కార్యక్రమాలు
ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఏ ఊరికిపోయినా కేసీఆర్‌ పథకాలు అందని ఇల్లులేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మూడోసారి సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే నాలుగు కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. భూమి ఉన్నా, లేకున్నా తెల్లరేషన్‌ కార్డున్న 90 లక్షల మంది కుటుంబాలకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కల్యాణలక్ష్మి మాదిరి సౌభాగ్యలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి 18 ఏండ్లు నిండిన అర్హులైన ఆడబిడ్డలకు నెలకు రూ.3 వేల ఆర్థిక సహాయం అందజేసి, ఆదుకుంటామని చెప్పారు.

తెల్లరేషన్‌ కార్డున్న ప్రతీ కుటుంబానికి సన్నబియ్యం అందిస్తామని, 5 లక్షలుగా ఉన్న ఆరోగ్య బీమాను రూ.15 లక్షలకు పెంచుతామని, అసైన్డ్‌భూములున్న వారందరికీ పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు. రైతుబంధు కింద ప్రస్తుతం ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలకు పెంచుతామని చెప్పారు. ఆసరా పింఛన్‌ కింద ఇచ్చే మొత్తాన్ని క్రమక్రమంగా రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు. ప్రతీ తండాలో సేవాలాల్‌ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలను కట్టించే బాధ్యత తమదేనని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

ముచ్చటగా మూడోసారీ కేసీఆరే సీఎం
బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తున్నదని, మూడోసారి కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపడతారని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమంకోసం పనిచేసే వారిని ఆదరిస్తారని, ఎన్నికల సమయంలో వచ్చే పొలిటికల్‌ టూరిస్ట్‌లను నమ్మబోరని చెప్పారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్‌లో సనత్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఆరు నెలలకోసారి సీఎం మారతాడని, వారికి పదవిపై ఆశ తప్ప అభివృద్ధిపై ఉండబోదని విమర్శించారు. ఒక్క సీఎం సీటు కోసం 400 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని, కుర్చీ, పదవి కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. బీజేపీకి అభివృద్ధి నమూనా ఉండదని, కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టి రాజకీయం చేయడమే పనిగా పెట్టుకుంటారని చెప్పారు. హైదరాబాద్‌లో బీజేపీ అనేది ఉండకూడదని, గోషామహల్‌లో బీజేపీకి డిపాజిట్‌ రాదని, ఇందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈసారి బీజేపీకి ఆ ఒక్క సీటు కూడా రాదని, రాష్ట్రంలో మోదీకి ఎంట్రీ లేదని ఈ ఎన్నికలు నిరూపిస్తాయని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.