Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

రాజ్యసభకు వద్దిరాజు ఏకగ్రీవం

రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఈ నెల 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది.


నేటి నుంచి దేశవ్యాప్త వరుస పర్యటనలకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాన్నిసాధించి తన జాతి జనుల కలను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు భారత జనుల ఆకాంక్షల సాధన కోసం కదలబోతున్నారు. జాతీయ కార్యాచరణకు నడుం బిగించబోతున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెలాఖరు వరకు వివిధ రాజకీయ, సామాజిక కార్యక్రమాలతో పాటు పలువురు రాజకీయ, ఆర్థిక , పాత్రికేయ ప్రముఖులతో దేశ భవిష్యత్తు దశ, దిశ పై సమాలోచనలు చేయనున్నారు.


తెలంగాణకు సర్ఫేస్‌

మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నది. ఇంగ్లండ్‌కు చెందిన ఫార్మా సంస్థ ‘సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌’ దేశంలో ఎకడాలేని అత్యాధునిక పార్టికల్‌ క్యారెక్టరైజేషన్‌ ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది


టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు వీరే.. వారి నేప‌థ్య‌మిది..

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల పేర్ల‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.


జూన్ 2న గ్రామీణ క్రీడా ప్రాంగ‌ణాలు ప్రారంభం : సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జూన్ 2న ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగ‌ణాల‌ను ప్రారంభించాల‌ని సీఎం ఆదేశించారు.


బీజేపీ సర్కార్ పెంచుతున్న అధిక గ్యాస్ ధరలకు నిరసనగా మహాధర్నా: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారంగా మారుతున్న గ్యాస్ ధర పెంపుదలకు నిరసనగా ఆదివారం (మే 15న) మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలేవి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రెడ్డి అన్నారు.


ఆయ‌న‌కు విందులు, చిందులే తెలుసు.. రాహుల్‌పై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు రైతులు, ఎడ్లు, వ‌డ్లు తెల్వ‌దు.. విందులు, చిందులు మాత్ర‌మే తెలుసని కేసీఆర్ మండిప‌డ్డారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు.


అమిత్ షా.. టూరిస్టులా వ‌చ్చిపోతామంటే కుద‌ర‌దు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ‌పై ప‌ర్య‌ట‌న‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వ‌చ్చి పోతామంటే కుద‌ర‌దు అని అమిత్ షా ప‌ర్య‌ట‌నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ప్ర‌క‌టించాల‌ని, విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల‌ని స‌బిత డిమాండ్ చేశారు.


మానవతకు మారుపేరు సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ గొప్ప మానవతా వాది.. మానవత్వానికి మారు పేరని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. పేదల ఆకలిని అర్థం చేసుకొని, వారి కడుపు నింపేలా అనేక పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.