Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆసరాపై ఆందోళనొద్దు

-అర్హులందరికీ పింఛన్లు… -ఈ నెల 10 నుంచి 15 లోగా పంపిణీ -రెండు నెలల డబ్బులు ఒకేసారి… -రానివారు మళ్లీ దరఖాస్తు చేయొచ్చు… -జిల్లాలో 2,50,000మంది అర్హులుగా గుర్తింపు -స్వార్థం కోసమే ప్రతిపక్షాల విమర్శలు -మంత్రి హరీశ్‌రావు వెల్లడి

Harish Rao

ఆసరాపై ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాక ఆర్టీసీ డిపోలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సంబంధించిన పింఛన్లను ఆపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు. ఈ నెల 10 నుంచి 15 లోగా అర్హులైన వారందరికీ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,50,000 మంది పింఛన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించామన్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రావాల్సిన రెండు నెలల పింఛన్లను ఒకేసారి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తదితరులతో కలిసి కొద్దిదూరం బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఆసరా పథకంపై ఆందోళన చెందొదని రాష్ట్ర భారీ నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 10 నుంచి 15 లోగా అర్హులైన వారందరికీ పింఛన్లను అందజేస్తామన్నారు. ఆదివారం దుబ్బాకలో ఆర్టీసీ నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు సంబంధించిన పింఛన్లను ఆపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,50,000 మంది పింఛన్లు పొందేందుకు అర్హులైన వారిగా గుర్తించామన్నారు. అదే విధంగా జిల్లాలో నిర్వహించిన సదరం క్యాంపుల ద్వారా 3000 మంది వికలాంగులు పింఛన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. పింఛన్ల పంపిణీ కోసం ఈ నెల 10 నుంచి 15 తేదీలోగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ఆసరా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రావాల్సిన రెండు నెలల పింఛన్లను వేయి రూపాయల చొప్పున రెండు నెలలకు రెండు వేల రూపాయలు, వికలాంగులకు 1500/- చొప్పున రెండు నెలలకు గాను రూ. 3000/- అందజేస్తామన్నారు. అయితే ఎంతో పారదర్శకంగా కొనసాగుతున్న ఆసరా కార్యక్రమాన్ని కొన్ని విపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అర్హులైన వారికి పింఛన్లు రాక పోతే సంబంధిత తహసీల్దార్‌కుగానీ, ఎంపీడీవోకు గానీ దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా అందజేస్తామన్నారు. కేవలం సమగ్ర సర్వే సందర్భంగా వివరాలు నమోదు చేసుకోలేని వారికి సంబంధించిన పింఛన్ల విషయంలో మాత్రమే కొంత జాప్యం జరిగిందన్నారు. అన్ని అడ్డంకులు అధిగమించి, ఈ నెల 10 నుంచి 15 లోగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో 40 శాతానికే వికలాంగ పింఛన్లు ఇస్తే..

ఆంధ్రాలో 80 శాతం ఉంటేనే పింఛన్లట అంగవైకల్యం కలిగిన వారికి ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్ల విషయంలో తెలంగాణలో 40 శాతం వైకల్యం ఉన్నా 1500/- పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తే, ఆంధ్రాలో మాత్రం 80 శాతం వైకల్యం ఉంటేనే వికలాంగుల పింఛన్లు ఇవ్వాలని అక్కడి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ప్రజలు గుర్తించాలన్నారు. చంద్రబాబుకు భజన చేసే టీటీడీపీ నేతలు అక్కడి వికలాంగులకు జరుగుతన్న అన్యాయం కనిపించక పోగా, ఇక్కడి వికలాంగులకు తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న న్యాయంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అర్థం చేసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో పింఛన్‌కు అర్హులైన వారికి గనుక సాంకేతిక పరంగా ఏమైనా ఇబ్బంది తలెత్తితే సత్వరమే న్యాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకాన్ని విజయవంతం చేసేందుకు గ్రామాల ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ పథకం కింద పేద దళిత యువతి వివాహానికి ఖర్చుల కింద ప్రభుత్వం రూ 51,000/- లను అందిస్తుందన్నారు. ఈ పథకం కింద ఆ కుటుంబానికి పెళ్లికి ముందే డబ్బులు అందుతాయన్నారు. పెళ్లి కూతురు తల్లి దండ్రులు ఆర్థికంగా అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో పెళ్లికి ముందే రూ.51,000/- చెక్కును అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని వారు సంబంధిత తహసీల్దారుకు కూడా నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నదన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల భోజనం కోసం సన్నబియ్యాన్ని సరఫరా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో 136 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయన్నారు. ఈ హాస్టళ్లు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేకించి మెదక్ జిల్లాలో కలెక్టర్ రాహుల్ బొజ్జా చొరవతో ప్రత్యేకంగా వాటి అభివృద్ధికి ఒక బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ హాస్టళ్లన్నింటికీ ఒక్కో హాస్టల్‌కు ఒక ప్రత్యేకాధికారిని నియమించి, ప్రతి నెలకు ఒక రోజు హాస్టల్‌లోనే బస చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నా రు. సదరు అధికారి హాస్టల్‌లో ఉండి, విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను వారు స్వయంగా చూసి, సమస్యల పరిష్కారానికి మార్గాలను కూడా అన్వేషించడం, వాటి పరిష్కారానికి చొరవ చూపే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో అన్ని సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి, రాష్ర్టాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, సిద్దిపేట ఆర్డీవో ఎ. ముత్యంరెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ సభ్యురాలు గౌతమీ మహేశ్, ఎంపీపీ పధ్మా శ్రీరాములు, తహసీల్దార్ అరుణ, ఎంపీడీవో ప్రవీణ్, నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామారావు, జేఏసీ కన్వీనర్ రొట్టె రాజమౌళి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. 80

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.