Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేసీఆర్‌.. ఒక శిఖరం

-కొందరు ఆనవాళ్లు చెరిపేస్తామంటున్నరు
-తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్‌ ఆనవాళ్లు
-జాతిపితనని కేసీఆర్‌ చెప్పుకోలే..ప్రజలే ఆయన్ను జాతిపితగా పిలుస్తున్నరు
-మాది సామంతుల.. కీలుబొమ్మల.. తోలు బొమ్మల జాతి కాదు.. స్వతంత్రుల జాతి
-తెగువ, పౌరుషమున్న భూమిపుత్రుల జాతి
-తెలంగాణలో ఉన్నవి రెండే రెండు జాతులు తెలంగాణవాదుల జాతి, తెలంగాణ ద్రోహుల జాతి.. మాది కేసీఆర్‌లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి తెలంగాణభవన్‌లో జరిగిన కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో నిప్పులు చెరిగిన కేటీఆర్‌
తెలంగాణ మట్టితో మమేకమైన వాళ్లకు.. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్లకు.. ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగులేసిన వాళ్లకే జాతి అంటే ఏంటో తెలుస్తది. జాతి గౌరవమంటే ఏంటో తెలుస్తది. సకలజనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు.. సమైక్యాంధ్రవాదుల సంచులు మోసినవాడికి జాతి, నీతి ఏం తెలుస్తది?
-కేటీఆర్‌

ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహులకు జాతి తెలియదు.. నీతి తెలియదు’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్రుల సంచులు మోసినవారికి జాతిచరిత్ర ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని, ఒకటి తెలంగాణవాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి అని చెప్పారు. ‘మాది కేసీఆర్‌ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి’ అని తూర్పారబట్టారు. ‘కొంతమంది కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడుతున్నరు. కేసీఆర్‌ జన్మదినం సం దర్భంగా నేను చెప్తున్న.. తెలంగాణనే కేసీఆర్‌ ఆనవాళ్లు కదా! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కేసీఆర్‌ ఆనవాళ్లు కదా! దాన్ని ఎట్లా చెరిపేస్త్తవు? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఒకటి మాత్రం వాస్తవం.. కేసీఆర్‌ ఒక శిఖరం, నువ్వు ఒక శకలం.. నీ స్థాయి గదే.. నీ బతుకు గదే’ అని ధ్వజమెత్తారు.

తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలను మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పార్టీ యువ నేత తలసాని సాయికిరణ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో తెలంగాణభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అతిథులుగా హాజరై కేసీఆర్‌ 72వ బర్త్‌ డేను పురస్కరించుకొని 72 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం కేసీఆర్‌ నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమా లు, ఉద్యమ పాటలు, డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

నాడు మనీ పవర్‌ లేదు.. మజిల్‌ పవర్‌ లేదు
‘నాడు కేసీఆర్‌ తెలంగాణ కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో టీడీపీ, మరో వైపు నూరేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌, మరో జాతీయ పార్టీ బీజేపీ.. మూడు బలమైన రాజకీయ శక్తులను ఢీకొన్నారు. అలా ఢీకొనాలంటే సాహసం కావాలి. కానీ అది సాహసం కాదు.. దుస్సాహసమనే చెప్పాలి.’ అని కేటీఆర్‌ గుర్తుచేశారు. మీడియా పవర్‌ లేదు.. మనీ పవర్‌ లేదు.. మ జిల్‌ పవర్‌ లేదు.. కుల బలం లేదు.. ధన బలం లేదు.. ఆనాడు ఉన్నదల్లా ఒకటే.. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం‘ అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

ద్రోహులకు జాతి విలువ తెలియదు
జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ మట్టితో మమేకమైన వాళ్లకు, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్లకు, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు వేసిన వాళ్లకు మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది. జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకలజనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు.. సమైక్యాంధ్రవాదుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలువదు.. నీతి తెలువదు.. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురొడ్డి నిలబడ్డోళ్లకు జాతి అంటే ఏంటి, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుస్తది. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్‌ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎకడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తది. కానీ, ‘జై తెలంగాణ’ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, తెలంగాణ సోయి లేని ద్రోహులకు జాతి విలువ ఎన్నటికీ తెలువదు’ అని నిప్పులు చెరిగారు.

రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా సంబోధించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్‌ ఏ జాతికి నువ్వు జాతిపిత?’ అని అవాకులు, చెవాకులు పేలుతున్న అల్పులకు చెప్తున్నా’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ‘ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం కాదు మేము. నిటారుగా నిలబడ్డ వెన్నెముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం.. సామంతుల జాతి కాదు.. స్వతంత్రుల జాతి మాది. గిరిగీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్‌ జాతి మాది. ఢిల్లీ గిరిగీస్త్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్ఠానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. కిరాయి వాళ్ల పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాది’ అని ధ్వజమెత్తారు.

ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? రక్తంలో పౌరుషం ఉంటే.. డీఎన్‌ఏలో ఉద్యమం ఉంటే.. ఆత్మాభిమానం అనేది ఎకడన్నానీ శరీరంలో ఉంటే.. నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తది. కానీ, ‘జై తెలంగాణ’ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, తెలంగాణ సోయి లేని ద్రోహులకు జాతి విలువ ఎన్నటికీ తెల్వదు.
-కేటీఆర్‌

మీది తెలంగాణ ద్రోహుల జాతి
తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయని, ఒకటి తెలంగాణవాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి అని కేటీఆర్‌ చెప్పారు. ‘ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?’ అని అడిగిన వాళ్లకు ఇవన్నీ చెప్తున్నా.. మాది కేసీఆర్‌ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి.. కేసీఆర్‌ నేను జాతిపితనని ఎన్నడూ చెప్పుకోలేదు. ప్రజలే పిలుచుకున్నరు. ఎవరైతే స్వాతంత్య్రం తెచ్చిండ్రో తమ జాతికి, ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నరు. పెద్దమనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్దమనిషి కాబట్టే ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకు, ఆ పిల్లలకు హీరో ఉంటరు. కానీ, నా తండ్రి ఇవాళ తెలంగాణకు హీరో. అది తెలంగాణ జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం’ అని స్పష్టంచేశారు. ‘తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్‌ ఆనవాళ్లు కదా! దాన్ని ఎట్లా చెరిపేస్తావు?’ అని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండాను ఎగరేయడమే అందరి లక్ష్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒకటే. పుట్టినరోజు గిఫ్ట్‌ ఒకటే. ఐకమత్యంగా కొట్లాడుదాం. కలిసికట్టుగా కదం తొకుదాం. మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరేయడమే, కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరుకానుక’ అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, సుధీర్‌రెడ్డి, తెలంగాణభవన్‌ ఇన్‌చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

బెస్ట్‌ అజిటేటర్‌, బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ కేసీఆరే
14 ఏండ్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి కేసీఆర్‌ సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల తన పాలనలో అద్భుతంగా తీర్చిదిద్దారని కేటీఆర్‌ చెప్పారు. ‘ఆనాడు ఢిల్లీలో ఒక సందర్భంలో అరుణ్‌ జైట్లీ మాతో మాట్లాడుతూ ‘జనరల్‌గా నాయకులు అయితే బెస్ట్‌ అజిటేటర్స్‌ (ఉద్యమకారులు) ఉంటారు. లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్‌ (పరిపాలకులు) ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులు.. బెస్ట్‌ అజిటేటర్‌ కేసీఆరే. బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ కూడా కేసీఆరే.. అది మీ అదృష్టం’ అని చెప్పారు. 10 ఏండ్లు రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలిపిన నాయకుడు కేసీఆర్‌.. దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్‌’ అని కొనియాడారు.

మాది రాణి రుద్రమ జాతి
రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది
జల్‌, జంగల్‌, జమీన్‌ అని కొట్లాడిన కుమ్రం భీముడి జాతి మాది
అస్తిత్వం కోసం అమరులైన సమ్మక, సారలమ్మల జాతి మాది
కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది
భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది
బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి మాది
సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది
సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరేసిన తుర్రేబాజ్‌ ఖాన్‌ జాతి మాది
ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన దాశరథి జాతి మాది
1952లో గైర్‌ ములీ గో బ్యాక్‌ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది
1969లో కరష కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి మాది
మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది
అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది
నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది..
తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది
సామంతుల జాతి కాదు.. స్వతంత్రుల జాతి మాది.

కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతరు: తలసాని
తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తిగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ బర్త్‌ డే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ పదేండ్ల పాలనలో దేశం అబ్బురపడేలా అనేక పథకాలు అమలుచేసిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని కొనియాడారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాద ని, అధికారంలో ఉన్నామని దౌర్జన్యాలు చేస్తామంటే ప్రజలు తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలకు గతంలో ఏ ముఖ్యమంత్రీ ప్రచారం చేయలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించినా, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా చెప్పుకోదగ్గ ఫలితాలు కాంగ్రెస్‌ సాధించలేదని విమర్శించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.