Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కాంగ్రెసోళ్లది పదవుల లొల్లి

-పీసీసీ కుర్చీ కోసమే వారి ఆరాటం
-మనది బతుకుదెరువు పోరాటం
-ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు
-జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

‘కాంగ్రెసోళ్లది కుర్చీల పంచాయితీ.. మనది తెలంగాణ బతుకుదెరువు పంచాయితీ’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్‌ జిల్లాకేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాం గ్రెస్‌ నాయకులు కుర్చీల కోసం పాదయాత్రలు చేస్తున్నారే తప్పా.. రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదని విమర్శించారు. వారి పాలనలో సాగునీరు లేక, మద్దతు ధర దక్కక రైతు లు ఆత్మహత్యలు చేసుకొన్నారని చెప్పారు. తెలంగాణలో రైతు సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత కరెంటు ఇస్తున్నామని.. కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలైన పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని జాతీయ పార్టీల నేతలు ఢిల్లీలో గులాంగిరీ చేస్తున్నారని మంత్రి విమర్శించారు. సమావేశంలో శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, మెదక్‌ జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జి వేలేటి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.

పలుచోట్ల సభ్యత్వ నమోదు…
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. అధికారమే పరమావధిగా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కొనసాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ మం డలం తాళ్లగొమ్మూరులో ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కారేపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ పరిశీలించారు.

కార్యకర్తగా గర్వపడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ సభ్యత్వం స్వీకరించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కవిత పిలుపునిచ్చారు.

పెద్దరికమంటే వయసు కాదు
-అభివృద్ధిలో చూపించాలి
-కాంగ్రెస్‌ నేత జానారెడ్డికి
-మంత్రి జగదీశ్‌రెడ్డి చురక
పెద్దరికం అనేది వయస్సులో కాదు.. సమస్యల పరిష్కారంలో, అభివృద్ధిలో చూపాలని కాంగ్రెస్‌ నేత కుందూరు జానారెడ్డికి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హితవు పలికారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఆదివా రం టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో జిల్లా భ్రష్ఠుపట్టి పో యిందని ధ్వజమెత్తారు. చాలీచాలని కరెంట్‌తో నల్లగొం డ జిల్లాలో పొలాలను ఎండబెట్టారని విమర్శించారు. 35 ఏళ్లుగా జానారెడ్డి నిర్వాకం నాగార్జునసాగర్‌ ప్రజలకు తెలుసని, ఆయనను భరించలేకనే 2018 ఎన్నికల్లోనే ఇంటికి పంపించారని చురకలు అంటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.