-658 గ్రామాల్లో కంటి వైద్యశిబిరాలు -తండోపతండాలుగా తరలివస్తున్న జనం -మంగళవారం 1,37,225 మందికి పరీక్షలు

కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కంటిపరీక్షలు చేయించుకున్నవారిసంఖ్య పదిలక్షలు దాటింది. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని ప్రజలు కంటివైద్య శిబిరాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తొమ్మిదిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 824 వైద్య బృందాలతో 658 గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. మంగళవారం సాయంత్రానికి 10,02,184 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,94,368 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. మరో 2,67,365 మందికి ప్రత్యేక అద్దాల కోసం ప్రతిపాదించగా.. 1,11,701 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సల నిమిత్తం రిఫర్‌చేశారు. 1,06,453 మందికి కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు రిఫర్‌చేయగా.. ఇప్పటివరకు 6,034మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు పూర్తిచేశారు. వైద్యశిబిరాల్లో పాల్గొన్నవారిలో 3,18,869 మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. కాగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 1,37,225 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 25,493 మందికి రీడింగ్ అద్దాలు అందజేయగా.. ప్రత్యేక దృష్టిలోపం ఉన్న 29,998 మందికి ప్రత్యేక అద్దాలను ప్రతిపాదించారు. 9,949 మందికి కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు ప్రతిపాదించగా, 663 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు పూర్తిచేశారు.

గ్రేటర్‌లో ఒక్కరోజే 27,038కి పరీక్షలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం ఒక్కరోజే 27,038 మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇందులో 7,114 మందికి కంటి అద్దాలు పంపిణీచేయగా, 3,620 మందిని శస్త్రచికిత్స కోసం రిఫర్ చేశారు.
సూర్యాపేటలో ఉప్పొంగిన సంతోషం సూర్యాపేట జిల్లాలో కంటివెలుగు శిబిరాల్లో వైద్యపరీక్షలు చేయించుకున్నవారు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. కంటి అద్దాలు పెట్టుకుని మురిసిపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 29,397 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 6, 248 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు. 3,618 మందిని శస్త్రచికిత్సకు రిఫర్ చేశారు. మంగళవారం 3,139మందికి పరీక్షలు నిర్వహించి..611 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు.
భద్రాద్రి కొత్తగూడెంలో 58 మందికి శస్త్రచికిత్సలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 34,888 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 8,231 మందికి కంటి అద్దాలు అందజేశారు. 58 మందికి శస్త్రచికిత్సలు చేశారు. మంగళవారంనాడు 4,275 మందికి కంటిపరీక్షలు చేశారు. 834 మందికి కంటి అద్దాలు అందజేశారు.
మెదక్‌లో 31,054 మందికి కంటిపరీక్షలు మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 31,054 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 3,945 మందికి కంటి అద్దాలను పంపిణీచేశారు. 2,098 మందికి కంటి ఆపరేషన్ల కోసం రిఫర్‌చేశారు. మంగళ వారంనాడు జిల్లావ్యాప్తంగా 3,802 మందికి కంటి పరీక్షలు చేయగా, 320 మందికి కంటి అద్దాలను పంపిణీచేశారు.
ఖమ్మంలో ముమ్మరంగా.. ఖమ్మం జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 5,663 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 37,884 మందికి పరీక్షలు నిర్వహించి.. 9,398 మందికి కంటి అద్దాలను అందించారు. మరో 10,218 మందికి ప్రత్యేక కంటి అద్దాలు ప్రతిపాదించారు. కంటి శుక్లాలు, క్లిష్టతరమైన శుక్లాలు, కార్నియా, నీటికాసులు, కంటిపొర, మెల్లకన్ను, రెటీనా సమస్యలతో బాధపడుతున్నవారు 6,927 మంది ఉన్నట్లు గుర్తించారు.

కామారెడ్డిలో 87 గ్రామాల్లో పూర్తి కామారెడ్డి జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 87 గ్రామాల్లో 27,024 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,705 మందికి కంటి అద్దాలను పంపిణీచేశారు. దృష్టిలోపం ఎక్కువగా ఉన్న 4,716 మందికి ప్రత్యేక అద్దాల కోసం రిఫర్ చేశారు. కంటి శస్త్రచికిత్సల కోసం 3,649 మందిని గుర్తించారు.
ఆదిలాబాద్‌లో భారీ స్పందన ఆదిలాబాద్ జిల్లాలో కంటివెలుగు కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నది. జిల్లాలో మంగళవారం వరకు 25,140 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 5,450 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు. మరో 2,585 మందికి త్వరలోనే ప్రత్యేక అద్దాలు ఇవ్వనున్నారు. 6,087 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్‌చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 18,258 మందికి కంటిపరీక్షలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు18,258 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 4,077 మందికి కంటి అద్దాలు అందించారు. 1,304 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్‌చేశారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 3,430 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి.. 279 మందికి కంటి అద్దాలను అందించారు. వందమందిని ఆపరేషన్ల కోసం రిఫర్ చేశారు.

మంచిర్యాలలో విశేష స్పందన మంచిర్యాల జిల్లాలో కంటివెలుగుకు విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటివరకు 34,350 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 5,772 మందికి అద్దాలు అందజేశారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్న 3,757 మందిని శస్త్ర చికిత్సల కోసం రిఫర్ చేశారు. 8,633 మందికి ప్రత్యేక కంటి అద్దాలు ప్రతిపాదించారు.
నిర్మల్‌లో జోరుగా.. నిర్మల్ జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మంగళవారం నాటికి జిల్లాలో 19,681 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 4,902 మందికి కంటి అద్దాలు అందించారు. 2,476 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు.
భూపాలపల్లిలో ఉదయం నుంచే క్యూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కంటిపరీక్షల కోసం జనం ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 23,690 మందికి కంటిపరీక్షలు చేశారు. 6,468 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా.. 3,679 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం రిఫర్‌చేశారు.
మహబూబాబాద్‌లో 31,592 మందికి పరీక్షలు మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 31,592 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,985 మందికి కంటి అద్దాలు అందించారు. కంటి శుక్లాలు, కార్నియా, గ్ల్ల్లకోమ, టెరీజియం వంటి వ్యాధులతో 5,222 మంది బాధపడుతున్నట్లు గుర్తించారు.