
ఆస్ట్రేలియా ఏసీటీ కన్వీనర్ రవి సాయల మాట్లాడుతూ తెలంగాణను ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నామన్నారు. అలాగే బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి, రాకేష్ లక్కరసు, వీరేందర్, సాంబరాజు, కిశోర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.