Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వాటర్‌గ్రిడ్‌తో దాహార్తి తీరుస్తాం

– నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం – సీఎంకు ఉద్యోగులంటే ప్రేమ.. ఏదడిగినా కాదనలేదు – బంగారు తెలంగాణకు కృషిచేయాలి: మంత్రి కేటీఆర్ – దేశానికి కాంగ్రెస్, రాష్ర్టానికి టీడీపీ అరిష్టమని వ్యాఖ్య – వీలైనంత త్వరగా పనులు పూర్తి.. మంత్రి జగదీశ్‌రెడ్డి

KTR-review-on-Water-grid-project-in-nalgonda

వాటర్‌గ్రిడ్ పథకం.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక. నాలుగేండ్లలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చి ప్రజల దాహార్తి తీర్చుతాం. ఈ పథకంలో నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ ప్రాంతంగా మార్చేస్తాం అని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. గురువారం నల్లగొండ జిల్లాలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో విస్తృతంగా పర్యటించారు. తొలుత నకిరేకల్‌లో భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. సూర్యాపేటలో సమీపంలో దురాజ్‌పల్లి పెద్దగట్టుకు నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభోత్సవం, వివిధ మండలాల బీటీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దురాజ్‌పల్లి ఆలయంలో పూజల తర్వా త మిర్యాలగూడలో రూ.35లక్షలతో నిర్మించిన రైతుబజార్‌ను మంత్రులు ప్రారంభించారు. నల్లగొండ గ్రంథాలయంలో వట్టికోట ఆళ్వార్‌స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ శాపగ్రస్త నల్లగొండ జిల్లాలో ప్రజల రక్షిత తాగునీటి అవసరాన్ని వాటర్‌గ్రిడ్ పథకం పూర్తిగా తీరుస్తుందన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగా వాటర్‌గ్రిడ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు. వాటర్‌గ్రిడ్ పథకంలో నల్లగొండకు రూ.5800 కోట్లతో పెద్దపీట వేయడం, దామరచర్ల పవర్‌ప్లాంట్, యాదగిరిగుట్ట అభివృద్ధి, రాచకొండ, బీబీనగర్‌లో ఎయిమ్స్ వంటి అనేక కార్యక్రమాలు సీఎంకు జిల్లాపై ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రికి ఉద్యోగులంటే అమితమైన ప్రేమ ఉందని, ఏదడిగినా కాదనకుండా అన్నీ ఇస్తున్నారని తెలిపారు.

పేస్కేళ్లు, పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న కేసీఆర్ కృషికి ఉద్యోగులు తోడ్పా టునివ్వాలని.. ఆయన కలల స్వప్నం సాకారానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై వ్యవహరించాలని సూచించారు. జిల్లాకు చెందిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతాయని ధీమా వ్యక్తంచేశారు.

టీడీపీ కాదు.. పక్కదేశం పార్టీ కాంగ్రెస్ దేశంలో, టీడీపీ రాష్ట్రంలో ఉంటే అరిష్టమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో చెత్త బుట్టలో వేశారని, వారికి భవిష్యత్‌లో పునాదులు కూడా మిగలవన్నారు. హైదరాబాద్‌లో ఉండి పరిపాలిస్తుంటే విదేశాల్లో ఉండి పారిపాలించినట్లుందని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని పీడీపీగా (పక్కదేశం పార్టీ)గా అభివర్ణించారు. ఆ పార్టీ తెలంగాణ నుంచి పూర్తిగా వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

పసలేని ప్రతిపక్షాలు ఆరోపణలు: జగదీశ్‌రెడ్డి రాష్టాన్ని బంగారు తెలంగాణగా పునర్నినిర్మించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఇంటింటికీ మంచి నీళ్లు అందించే వాటర్‌గ్రిడ్‌తోపాటు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారుల విషయంలోనూ అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేసేలా ముం దుకు సాగాలన్నారు.

కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కం దాల పాపిరెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్, కలెక్టర్ పీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.