Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వైద్యానికి నిధులేవి?

-మనమే వైద్య సదుపాయాలు పెంచుకోవాలి
-ఎన్ని వైరస్‌లొచ్చినా ప్రజల్ని కాపాడుకోవాలి
-మిడతలు వస్తయంటే తరిమేందుకు సిద్ధమైనం
-వైరస్‌లను కూడా అదేవిధంగా ఎదుర్కోవాలి: సీఎం

ప్రపంచంలో ఎప్పటికీ వైరస్‌లు నశించిపోవని.. వాటిని ఎదుర్కోవడానికి మనమే అన్ని విధాలా సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిస్పందించిన సందర్భంగా వైద్యారోగ్యరంగానికి తగినవిధంగా నిధులు మంజూరు చేయకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

మిడతల్ని తరిమేందుకు ఏర్పాట్లుచేశాం
నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే.. మనకు కూడా మిడతలు వస్తాయంటే బాధపడ్డాం. వాస్తవంగా ఇక్కడి దాకా రావు. రాజస్థాన్‌, గుజరాత్‌ వరకు ఇండియా సరిహద్దులో మధ్య ఆసియా, అఫ్గానిస్తాన్‌, వయా పాకిస్తాన్‌ వచ్చిపోతయి. కానీ పోయినసారి విచిత్రంగా హర్యానా మీదుగా మధ్యప్రదేశ్‌లోకి, మహారాష్ట్రకు నుంచి మన విదర్భ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు వరకు వచ్చాయి. మనకు కూడ వస్తయని భయపడి సన్నద్ధమై ఫైరింజన్లన్నీ మన రాష్ట్ర సరిహద్దులో పెట్టాం. ఆ సందర్భంలో ఎంటమాలజిస్టులు వచ్చారు. సెంట్రల్‌ గవర్నమెంటు వాళ్లు, మన స్టేట్‌ గవర్నమెంటు వాళ్లున్నరు. నేను మన పంటలు కాపాడుకోవాలని, ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నామని.. మీరు వెళ్లి సరిహద్దుల్లో ఉండాలని వాళ్లకు ప్రత్యేకంగా హెలికాప్టర్‌ ఇచ్చి, ఎన్టీపీసీలో, సింగరేణి కాలనీలో ఏర్పాట్లుచేసి అక్కడ పెట్టాము. వాళ్లను చాలా గౌరవంగా చూసుకొన్నాం. కానీ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వాళ్లే మిడతలను చంపేశారు. అదృష్టం కొద్దీ అవి మనకురాలేదు, బచాయించాం.

తెలివిగల ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకొంటయి
ఆ తరువాత ఒక సమీక్ష సమావేశంలో అమాయకంగా ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ సమాజంలో వీటిని నిర్మూలించవచ్చు కదా అని అడిగాను. అయితే నిర్మూలించలేమని ఎంటమాలజిస్టులు చెప్పారు. ఎందుకు చేయలేరని ప్రశ్నిస్తే.. వాళ్లు మానవ జాతితోపాటు ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికి ఉన్న పరిజ్ఞానం మేరకు శాస్త్ర పరిశోధనలు తేల్చిన మేరకు నాలుగు లక్షల ఏండ్లక్రితం మనుషులు వచ్చిండ్రని చెపుతరు. కానీ కరోనా వంటివి, మిడతల లాంటివి, స్వైన్‌ ఫ్లూ లాంటి అనేక రకాలైన లక్షల వైరస్‌లు 8 లక్షల సంవత్సరాల క్రితం వచ్చాయి. వాటికి ఎప్పుడు వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయో అప్పుడు అవి విజృంభిస్తాయి. మనుషులను బాధ పెడతాయి. చంపేస్తయని చెప్పారు. ‘ఒక్క మిడతల గురించి అడిగితే లక్షల వైరస్‌ల గురించి భయపెడితిరి’ అంటే.. ‘అవును వస్తయి’ చెప్పిన్రు. మరి ఏమి చేయాలని అడిగితే.. ‘ఏమీ లేదు సర్‌.. తెలివి గల ప్రభుత్వాలు, తెలివి గల సమాజాలు ఉన్నకాడ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బాగా పటిష్ఠం చేసుకొంటయి. చాలా తక్కువ నష్టాలతో బయటపడతయి. మీ రాష్ట్రంలో కూడ మంచిగనే చేసుకొంటున్నరు. హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాగా బలోపేతం చేసుకోవాలి’ అని చెప్పారు.

పది వేల కోట్లతో దవాఖానల ఏర్పాటు
తెలంగాణలో ఎక్స్‌ట్రా రూ.10 వేల కోట్లు బడ్జెట్‌ ప్రత్యేకంగా పెట్టి.. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌)ను ఏర్పాటు చేసి దాని కింద నాలుగు పెద్ద దవాఖానలను తెస్తున్నాం. ఒకటి అల్వాల్‌లో, ఒకటి ఎల్బీనగర్‌లో, చెస్ట్‌ దవాఖానలో, వరంగల్‌లో, నిమ్స్‌లో. ఇప్పటికే గచ్చిబౌలి టిమ్స్‌తో కలిపి మొత్తం ఆరు వైద్యశాలలు రూ.12 వేల కోట్లతో మల్టీ స్పెషాలిటీ దవాఖానలు తెస్తున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లోని అన్ని బెడ్స్‌ను ఆక్సిజన్‌ బెడ్స్‌గా చేస్తున్నాం. వెంటిలేటర్లు సరిపడా పెట్టుకొన్నాం. ఆక్సిజన్‌ ప్రొడక్షన్‌ లేక గతంలో బాధలు పడ్డాం కాబట్టి.. మన రాష్ర్టానికే అత్యవసరం పడితే 550 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని తేలింది. ఇప్పటికే 380 టన్నులు రాష్ర్టానికి వచ్చింది. ఇంకో 200 టన్నులకు పెంచుతున్నాం. భవిష్యత్తులో అనుకోని వైరస్‌ వచ్చినా కూడా వెంటనే రంగంలోకి దూకి ప్రజలను కాపాడుకొనేలా మినిమం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మ్యాగ్జిమం చేస్తున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.