Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఆర్‌ఎస్ తీన్‌మార్

-వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేటలో గులాబీ గుబాళింపు -ప్రతిపక్షాల్ని ఊడ్చేసిన గులాబీ జెండా -కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టిన కారు -పోరుగల్లులో పునరావృతమైన ఉప ఎన్నిక ఫలితం -మూడింటా గులాబీ జెండా -ప్రతిపక్షాల చిరునామా గల్లంతు -కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టిన కారు -పోరుగల్లులో పునరావృతమైన ఉప ఎన్నిక ఫలితం -అచ్చంపేటలో మహాకూటమికి మహాఓటమి

రెండు కార్పొరేషన్లు, ఒక నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. మూడుచోట్లా ప్రతిపక్షాలను ఊడ్చి అవతల పారేసింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ఓరుగల్లులో మరోసారి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటే, ఖమ్మంలో ఎర్రకోటను బద్దలు కొట్టి చరిత్ర తిరగరాసింది. అచ్చంపేటలో మొత్తానికి మొత్తం సీట్లన్నీ క్లీన్‌స్వీప్ చేసింది. కారు ధాటికి ప్రతిపక్షాలు ఉనికి చాటుకునేందుకే తిప్పలు పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలంతా ఆయా ప్రాంతాల్లో మోహరించి ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. అచ్చంపేటలో జట్టు కట్టి ఏర్పాటు చేసుకున్న మహాకూటమికి మహా ఓటమి ఎదురైంది. అక్కడ టీఆర్‌ఎస్ మొత్తం 20 సీట్లూ కైవసం చేసుకుంది. రెండు కార్పొరేషన్లు, ఒక చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్ ఈ ఎన్నికతో తెలంగాణలో టీడీపీని తుడిచిపెట్టింది. ఆంధ్రపార్టీకి ఇక ఈ గడ్డమీద స్థానం లేదని ఎలుగెత్తి చాటింది. బలం లేదనే ప్రచారమున్న ఖమ్మంలో కార్పొరేషన్‌ను కైవసం చేసుకుని.. ఆదిలాబాద్‌నుంచి మహబూబ్‌నగర్‌దాకా..మెదక్‌నుంచి ఖమ్మం దాకా రాష్ట్రంలో ఎక్కడా తనకు ఎదురేలేదని చాటిచెప్పింది.

TRS-Won-Warangal,-Khammam,-Achampet-Elections-02

రెండు కార్పొరేషన్లు, ఒక నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ మూడింటినీ కైవసం చేసుకుంది. వరంగల్ కార్పొరేషన్‌లో 58 స్థానాలకు 44, ఖమ్మం కార్పొరేషన్‌లో 50 స్థానాలకు 34 స్థానాలను గెలుచుకుంది. ఇక అచ్చంపేట నగర పంచాయతీలో మొత్తం 20 స్థానాలనూ గెలుచుకుని రికార్డు సృష్టించింది.

TRS-Won-Warangal,-Khammam,-Achampet-Elections-01

ప్రతిపక్షాలు ఎక్కడా బలమైన పోటీ ఇవ్వలేక పోయాయి. అచ్చంపేటలో ప్రతిపక్షాలకు ఒక్క స్థానమూ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో 10 స్థానాలు సాధించి ఉనికి చాటుకోగా వరంగల్‌లో కేవలం 4 స్థానాలతో చతికిలపడింది. టీడీపీ మూడింటా ఖాతా కూడా తెరువలేదు. బీజేపీ వరంగల్‌లో ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. సీపీఎం వరంగల్‌లో ఒక స్థానం, ఖమ్మంలో రెండు స్థానాలు గెలుచుకోగా సీపీఐ ఖమ్మంలో రెండు స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు గుప్పించినా.. అధికార పార్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టారు.

ప్రతిపక్షాలు కుమ్మక్కైనా..  రాష్ట్రంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న కారు జోరును నిలువరించాలని ప్రతిపక్ష పార్టీలు వేసిన ఎత్తు బెడిసి కొట్టింది. వరంగల్ ఖమ్మంలో లోపాయికారీ అవగాహనలతో పోటీ చేయగా, అచ్చంపేటలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేరుగా మహాకూటమిగా ఏర్పడి మరీ పోటీకి దిగారు. కానీ చైతన్యవంతులైన ఓటర్లు కూటమి కుట్రల్ని విజయవంతంగా ఛేదించారు. మూడు పార్టీల మాడు పగులగొట్టారు. గుండుగుత్తగా 20 వార్డులకిగాను ఇరవై గులాబీ ఖాతాలోనే వేశారు. తొలిసారిగా నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్‌తో కొత్త రికార్డును నమోదు చేసింది.

అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ చరిత్రలోనూ అధికార పార్టీ సరికొత్త రికార్డును లిఖించింది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మంలో అసలు ఆ పార్టీలకే ఉనికి లేకుండా చేసింది. చావుతప్పి కన్నులొట్టబోయినట్టు కాంగ్రెస్ 50 స్థానాల్లో పదింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఖమ్మం కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరడంతో టీఆర్‌ఎస్ రాష్ట్రంలోని పది జిల్లాల ప్రజల గొంతుకగా మారిందనే వాస్తవం బ్యాలెట్ రూపంలో తేటతెల్లమైంది. ఇక వరంగల్‌లో నిన్నటికి నిన్న ప్రతిపక్షాలకు డిపాజిట్లు ఇవ్వకుండా బుద్ధి చెప్పిన ఓటర్లు.. మరోసారి అవే ఫలితాల్ని పునరావృతం చేశారు. ఇంటి పార్టీకే వరంగల్ కార్పొరేషన్ పీఠాన్ని అప్పగించారు.

కలిసొస్తున్న పాజిటివ్ ప్రచారం..  ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పాజిటివ్ ప్రచారాన్నే నమ్ముకున్నది. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేస్తుంది? అనే అంశాల్నే ప్రజల ముందు ఉంచింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కే తారక రామారావు, టీ హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, చందూలాల్, జూపల్లి కృష్ణారావుతో పాటు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇంటి పార్టీని గెలిపిస్తే బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేసినట్లేనన్న నమ్మకాన్ని ఓటర్లలో కల్పించారు. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం గత 18 నెలలుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌ను విజయపథంలో నడిపేందుకు ప్రధానంగా దోహదపడ్డాయి.

TRS-Won-Warangal,-Khammam,-Achampet-Elections

టీఆర్‌ఎస్ సంపూర్ణ విజయం: మంత్రి ఈటల  ఖమ్మం మున్సిపల్ గెలుపుతో తెలంగాణపై టీఆర్‌ఎస్ సంపూర్ణమైన విజయం సాధించినట్లయ్యిందని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో 99 సీట్లు గెలిచిన తర్వాత, తాజాగా వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసిందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్, రంగారెడ్డిల్లో టీఆర్‌ఎస్ ఎక్కడుందని విమర్శించిన వారికి నేటి ఫలితాలే సమాధానమన్నారు.

ఎన్నిక ఏదైనా… తెలంగాణ రాష్ట్రంలో ఇంటి పార్టీ టీఆర్‌ఎస్ తన విజయ యాత్రను మరోసారి కొనసాగించింది. మెదక్ ఉప ఎన్నికతో మొదలు పెట్టి కంటోన్మెంట్, వరంగల్ పార్లమెంటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో అప్రతిహతంగా జైత్రయాత్ర సాగించిన అధికార పార్టీ తాజాగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాల దిమ్మతిరిగే విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఖమ్మం విజయం టీఆర్‌ఎస్ పార్టీలో హర్షాతిరేకాలను నింపింది. 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌కు దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, ఖమ్మంలలో అసలు బలమే లేదనే ప్రచారం ఉండేది. కానీ 2014 ఎన్నికల్లోనే దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్ బలం చాటింది. ఇక హైదరాబాద్ ఎన్నిక అధికార పార్టీకి అగ్నిపరీక్ష అనే భావన ఉండేది. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన చరిత్ర ఎరుగని విజయంతో ప్రతిపక్షాల గొంతు తడారిపోయింది. ఇక మిగిలిపోయిన ఖమ్మం ఈ ఎన్నికలో మోగించిన విజయదుందుభి టీఆర్‌ఎస్ సత్తాను చాటింది. ఆదిలాబాద్‌నుంచి మహబూబ్‌నగర్ దాకా..మెదక్‌నుంచి ఖమ్మందాకా 10 జిల్లాల్లో ఎక్కడా తనకు ఎదురేలేదని రుజువు చేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.