-టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్‌రావు

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్సే ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన పోచారంస్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనడానికి మంగళవారం ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.
తెలంగాణ తొలి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు 80స్థానాలకు తగ్గకుండా కట్టబెడతారని చెప్పారు. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో ఈ నెల 17న తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ పదవిని వరుసగా మూడుసార్లు జిల్లా ప్రజలు కట్టబెట్టడం హర్షనీయమన్నారు. తెలంగాణ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ 8జిల్లాలో పోటీ చేసి ఏడు జిల్లాల్లో ముందుందన్నారు. కొందరు టీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారికి 16న వచ్చే ఎన్నికల ఫలితాలే బుద్ధి చెబుతాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టిన నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. విలేకర్ల సమావేశంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.