– కంపెనీ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ హామీ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వివరించారు. ఇప్పటికే తమ సంస్థలో 26వేల మంది పనిచేస్తున్నారని త్వరలో మరో 28వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వారు వెల్లడించారు. టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖరన్, వైస్ ప్రెసిడెంట్ రాజన్న, ఐటీ శాఖ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్ తదితరులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడుతూ టీసీఎస్ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ రంగం వేగంగా విస్తరిస్తున్న ఇబ్రహీంపట్నం ఆదిభట్లలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని సీఎం పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు.