Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సత్వరం పూర్తిచేయాలి..

రాష్ట్రంలోని సాగునీటిపారుదల ప్రాజెక్టులను రెండుమూడేండ్ల గడువులోనే పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పనులు వేగవంతమయ్యేందుకు వివిధరకాల చర్యలు తీసుకోనుంది. -రెండు మూడేండ్లలోనే అన్ని ప్రాజెక్టుల నిర్మాణం -కృతనిశ్చయంతో టీఆర్‌ఎస్ సర్కారు -పనుల వేగవంతానికి చర్యలు -మూడు షిప్టుల్లో నిర్మాణ పనులు -గడువులోగా పూర్తిచేసే కాంట్రాక్టర్లకు -1 శాతం ఇన్సెంటివ్ చెల్లింపు -గడువు దాటితే డిస్‌ఇన్సెంటివ్ -ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏటా 25వేల కోట్లు -ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్

CM-KCR

ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్లను మూడు షిఫ్టుల్లో పనిచేయించి, అన్ని ప్యాకేజీలలో పనులను సమాంతరంగా చేపట్టి.. సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు 1 శాతం ఇన్సెంటివ్ (ప్రోత్సాహకం) ఇవ్వాలని, నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయకుంటే డిస్‌ఇన్సెంటివ్ ఇచ్చే విధానం కూడా ఉండాలని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై ఆయన శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అనేక ఆకాంక్షలున్నాయని, వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలో పాలనాపరమైన జాప్యాన్ని వీలైనంతవరకు తొలగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకోసం ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, అదే క్రమంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

ఇప్పటికే ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కృష్ణానదిపై పాలమూరు, డిండి, గోదావరి నదిపై కాశేళ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం లాంటి ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్దాలపాటు సాగేదని గుర్తుచేసిన సీఎం.. తెలంగాణ రాష్ట్రంలో రెండు, మూడేండ్లలోనే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. భూసేకరణ విషయంలో తీసుకున్న నిర్ణయాలవల్ల మంచి ఫలితాలు వచ్చాయని సీఎం చెప్పారు. భూసేకరణ వేగంగా జరుగుతున్నదంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఏటా రూ. 25 వేల కోట్ల కేటాయింపు కాంట్రాక్టర్లతో పనులు వేగంగా చేయించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడానికి అనువుగా బడ్జెట్ కేటాయింపులను నేరుగా నీటిపారుదల శాఖ ఖర్చుపెట్టేలా విధానం రూపొందించాలని సూచించారు. ప్రతీ ఏటా రూ.25 వేల కోట్ల నిధులను నీటిపారుదల శాఖకు కేటాయిస్తున్నందున పనులు జరుగుతున్న దానినిబట్టి నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయకు ఈ మొత్తంనుంచి చెల్లింపులు జరగాలని చెప్పారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు ఒకశాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని, అలాగే సకాలంలో పనులు పూర్తిచేయనివారికి డిస్‌ఇన్సెంటివ్ ఇచ్చే విధానంకూడా ఉండాలన్నారు.

దీనివల్ల కాంట్రాక్టర్లలో ఉత్సాహంతోపాటు బాధ్యత కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడాన్ని అత్యధిక ప్రాధాన్యం కలిగిన అంశంగా గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షాసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.