Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సాహసి కేసీఆర్

-86 ఏండ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన ఆయన వల్లే -సీఎం కృషితో యావత్‌దేశం చూపు తెలంగాణవైపు -నాలుగేండ్లలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పోచారం -పూర్వ నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రైతుబీమా అవగాహన సదస్సులు -పాల్గొన్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి -39 లక్షల మంది రైతులకు బీమా! -18 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడిన రైతులకు బీమా పాలసీ వర్తించదు

రాష్ట్రంలో 86 ఏండ్ల కిందట భూ రికార్డుల లెక్కలు జరిగాయని, మళ్లీ ఇన్నేండ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేయించి సాహస ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా ఈ సాహసానికి పూనుకోలేదని గుర్తుచేశారు. దశాబ్దాల తరబడి అనేక వివాదాలున్న భూములు, సాధారణ సమస్యలున్న భూములు సైతం ప్రక్షాళన ద్వారా కొలిక్కి వచ్చాయన్నారు. ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో రైతు సంక్షేమంపరంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచిందని వివరించారు. దీనికి సంబంధించి ఈ నెల 23న అవార్డును ప్రదానం చేయనున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న రైతుబీమా పథకం అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ నాలుగేండ్లుగా తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలవైపు యావత్తు దేశం చూస్తుండటం వెనుక సీఎం కేసీఆర్ పట్టుదల.. తపన ఎంతో ఉన్నాయని చెప్పారు. సీఎం రైతుల పట్ల చూపుతున్న తపన, పట్టుదల ముందు తన వయస్సు 70 ఏండ్ల నుంచి 30 ఏండ్లకు తగ్గిందని, దీంతో మరింత హుషారుగా పనిచేయాలని నిశ్చయించుకున్నానని మంత్రి పోచారం చమత్కరించారు. రాష్ట్రంలో నూతనంగా చేపట్టిన వివిధ పథకాలవల్ల వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ వ్యవసాయ మంత్రి తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా శాఖాపరంగా జరుగుతున్న అభివృద్ధిపై తనతో చర్చించారని, తాను రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, భూ రికార్డుల ప్రక్షాళనపై వివరిస్తే, నాలుగేండ్లలోనే ఇంతటి అభివృద్ధిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం 40 ఏండ్లుంటే ఎంతటి అభివృద్ధి చేపడుతుందోనని ఆశ్చర్యపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు పథకాల స్ఫూర్తిగానే నేడు ప్రధాని మోదీ సైతం రైతుల గురించి ప్రస్తావన చేయడం శుభపరిణామమని అన్నారు.

అభివృద్ధే సీఎం కేసీఆర్ నిరంతర తాపత్రయం: జగదీశ్‌రెడ్డి నాలుగేండ్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్రంపై చూపుతున్న తాపత్రయం, పెడుతున్న శ్రద్ధ, రూపొందిస్తున్న పథకాలు రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతులు కూడా ఊహించలేని ఎన్నో పథకాలను ప్రభుత్వం తీసుకొస్తున్నదని చెప్పారు. అప్పుల్లేకుండా సాగుచేసే రోజులురావాలని కలలుగన్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. దేశంలో రైతులకు బీమా కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు.

ఆంధ్రాకు తాకట్టు పెట్టడానికే కాంగ్రెస్ యాత్రలు: మంత్రి జూపల్లి తెలంగాణ రాష్ర్టాన్ని ఆంధ్రాకు తాకట్టు పెట్టడానికే కాంగ్రెస్ నాయకులు బస్సుయాత్రలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. సమైక్య పాలనలో ఏడేండ్ల కాలంలో 1763 మంది రైతులు కరంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారని మంత్రి గుర్తుచేశారు. నాడు రైతుల బాగోగులు పట్టించుకోని కాంగ్రెస్ నేడు ప్రేమను ఒలకబోస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.

ఆత్మహత్యలు తగ్గాయి: మంత్రి లక్ష్మారెడ్డి నాలుగేండ్ల టీఆర్‌ఎస్ సర్కారు పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని మంత్రి లకా్ష్మరెడ్డి చెప్పారు. రైతుకు అండగా ప్రభుత్వం నిలువడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఆగస్టులో ప్రారంభంకానున్న రైతుబీమా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని మంత్రి పేర్కొన్నారు.

ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం: గుత్తా సుఖేందర్‌రెడ్డి విద్యుత్, పెట్టుబడి, రుణమాఫీ, మద్దతుధర, సాగునీరు ఇలా ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. ఆహార ఉత్పత్తులకు కేంద్రం తెలంగాణ: ఎంపీ జితేందర్‌రెడ్డి

ఇతర రాష్ర్టాలకు, దేశాలకు తెలంగాణ నుంచే అన్ని రకాల ఆహార ఉత్పత్తులు ఎగుమతులు కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రైతులందరినీ సంఘటితం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రైతుబంధు చెక్కుల పంపిణీ రద్దు అవాస్తం -పట్టాదారు పాస్‌పుస్తకాల సరఫరా అయ్యేంత వరకు చెక్కులిస్తాం -వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి వెల్లడి

రైతుబంధు పథకం కింద పంపిణీ చేస్తున్న చెక్కులు పట్టాదారు పాసుపుస్తకాలు సరఫరా అయ్యేంత వరకు రైతులకు అందజేస్తామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి చెప్పారు. ఈ నెల 20 తర్వాత రైతుబంధు చెక్కుల పంపిణీ రద్దుచేస్తారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కలెక్టర్లు అభ్యంతరం చెప్పిన చెక్కులను మాత్రమే వాపస్ చేస్తామని అన్నారు.

39 లక్షల మంది రైతులకు బీమా! -రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులు -18 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడిన -రైతులకు బీమా పాలసీ వర్తించదు

రైతుబీమా పథకం 39 లక్షల మంది రైతులకు అందే అవకాశమున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. ఎల్‌ఐసీ ద్వారా రైతు బీమా పథకాన్ని అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే బీమా పథకం కింద రూ.5 లక్షలు వారి కుటుంబీకులకు అందుతాయి. రాష్ట్రంలో మొత్తం 58 లక్షల మంది రైతులున్నారు. అయితే.. పాలసీ నిబంధనల మేరకు 18 ఏండ్ల నుంచి 60 ఏండ్లలోపు వయసున్న రైతులకు మాత్రమే బీమా పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ వయసులో ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా 39 మంది లక్షల రైతులకు బీమాపథకం వర్తించే అవకాశం ఉందని అంచనావేశారు. ముఖ్యంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్న రైతుల్లో 18 ఏండ్లలోపు వయస్కులు, 60 ఏండ్లు పైబడిన వారు కూడా ఉన్నారు. వీరుకాకుండా వివిధ ప్రాంతాల్లో భూములు కలిగి, పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్న రైతు కూడా ఉన్నారని అధికారుల దృష్టికి వచ్చింది. వీరిని ఆధార్ ద్వారా ట్రేస్ చేసి ఒకే బీమా పాలసీ ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్నారై రైతులు బీమా పథకాన్ని తీసుకునే అవకాశంలేదని గుర్తించారు. ఇలాంటి రైతులందరికీ బీమా పథకం అవసరంలేదని అధికారులు అంటున్నారు. వీరుకాకుండా మిగిలిన రైతులందరికీ బీమా పథకం వర్తింపజేస్తారు. దీనికోసం గ్రామాలవారీగా అధికారులు ఎల్‌ఐసీ నామినీ పత్రాలను రైతుల వద్దనుంచి తీసుకుంటున్నారు. జూలై 10 తర్వాత బీమా పథకంలో చేరే రైతుల సంఖ్య పక్కాగా వస్తుందని అధికారులు చెప్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.