-సింగపూర్ మంత్రి టాంగ్‌తో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో సింగపూర్ సహకారాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి గో చాక్ టాంగ్‌తో సీఎం కేసీఆర్ సోమవారం నగరంలోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో భేటీ అయ్యారు. ఇటీవలి సింగపూర్ పర్యటన అనుభవాలను ముఖ్యమంత్రి ఆయనతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. మరోసారి సమావేశమై సింగపూర్-తెలంగాణ ప్రభుత్వాలు కలిసి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అవగాహన కుదుర్చుకుందామని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సీఎం స్పెషల్ సెక్రెటరీ రాజశేఖర్‌రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.