-కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు -పాతకొత్తల మేలు కలయిక -ఆరుగురు మంత్రులతో ప్రమాణంచేయించిన గవర్నర్ -మొదటగా హరీశ్, చివరగా అజయ్ -పవిత్ర హృదయంతో ప్రమాణంచేసిన కేటీఆర్ -దైవసాక్షిగా ప్రమాణంచేసిన మిగతా మంత్రులు -కేటీఆర్‌కు తిరిగి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖలు -హరీశ్‌రావుకు ఆర్థికశాఖ -విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి -జగదీశ్‌రెడ్డికి విద్యుత్‌శాఖ -వేముల, కొప్పుల, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి శాఖల్లో కొన్ని బదలాయింపు -గంగులకు బీసీ, పౌరసరఫరాలు -సత్యవతికి ఎస్టీ, మహిళాశిశు సంక్షేమం -అజయ్‌కుమార్‌కు రవాణా -కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

రాష్ట్ర మంత్రివర్గంలో ఆరుగురు మంత్రులు కొత్తగా కొలువుదీరారు. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు తీసుకొన్న నిర్ణయం మేరకు ఆరుగురికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రుల ప్రమాణంతో మంత్రిమండలిలో ఇప్పటివరకు ఉన్న మంత్రుల సంఖ్య 12 నుంచి 18కి పెరిగింది. ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లకు మంత్రివర్గంలో చోటుదక్కింది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన కొద్దిసేపటికే మంత్రులకు శాఖల కేటాయింపు ఆనంతరం కేటీఆర్‌కు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖలు కేటాయించగా, హరీశ్‌రావుకు ఆర్థికశాఖను కేటాయించారు. పాత మంత్రుల శాఖల్లో కొన్ని మార్పులు చేశారు.
కోలాహలంగా ప్రమాణస్వీకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా నిర్ణయించిన మేరకు ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా హరీశ్‌రావుతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆ తరువాత వరుసగా కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్‌తో ప్రమా ణం చేయించారు. కేటీఆర్ పవిత్ర హృదయం తో ప్రమాణం చేయగా, మిగతా మంత్రు లు దైవసాక్షిగా ప్రమాణం స్వీకరించారు. ప్రమా ణం తరువాత మంత్రులంతా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, మంత్రులు, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్‌రాములు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు తదితరులు తరలివచ్చారు.

తిలకం దిద్ది.. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లే ముందు కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రగతిభవన్‌లో కుటుంబసభ్యులు తిలకం దిద్ది, హరతిచ్చి పంపించారు. సీఎం కేసీఆర్ సతీమణి, కేటీఆర్ తల్లి శోభమ్మ, సోదరీమణులు మాజీ ఎంపీ కవిత, సౌమ్య, కూతురు అలేఖ్య, భార్య శైలిమ కేటీఆర్‌కు హారతి ఇచ్చి, తిలకం దిద్దారు. కేటీఆర్‌తోపాటు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న హరీశ్‌రావుకు కూడా హారతిచ్చి, నుదుట తిలకం దిద్దారు. అనంతరం కేటీఆర్ తల్లి శోభమ్మ.. బావ, బావమరుదులిద్దరినీ దీవించి పంపించారు. నేతలిద్దరు ఒకే కారులో ప్రగతిభవన్ నుంచి రాజ్‌భవన్‌కు వచ్చారు. వేదిక వద్ద ఇద్దరు పక్కనే కూర్చున్నారు. దర్బార్‌హాలు వద్దకు కేటీఆర్ రాగానే అభిమానులు పెద్దఎత్తున కేటీఆర్ జిందాబాద్, ఫ్యూచర్ లీడర్ కేటీఆర్, జై రామన్న అంటూ నినాదాలు చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తుండటంతో సీఎంకేసీఆర్ చేయిలేపి నినాదాలు ఆపాలని సైగచేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులందరూ గవర్నర్ తమిళిసైతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

శాఖల కేటాయింపు పూర్తి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయింపును పూర్తిచేశారు. సీఎం సూచనల మేరకు ఆయా మంత్రులకు శాఖలను గవర్నర్ తమిళిసై కేటాయించినట్లు రాజ్‌భవన్ ప్రకటన విడుదలచేసింది. కొత్తగా ప్రమాణంచేసిన మంత్రుల్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖలు ఇచ్చారు. హరీశ్‌రావుకు ఆర్థికశాఖ కేటాయించారు. మహిళా మంత్రుల్లో సబితాఇంద్రారెడ్డికి విద్యాశాఖ, సత్యవతి రాథోడ్‌కు గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖలను అప్పగించారు. పాత మంత్రుల్లో జీ జగదీశ్‌రెడ్డి నిర్వహించిన విద్యాశాఖను.. సబితాఇంద్రారెడ్డికి ఇచ్చి.. ఆయనకు గతంలో నిర్వహించిన విద్యుత్‌శాఖను మళ్లీ కేటాయించారు. కొప్పుల ఈశ్వర్ ఇప్పటివరకు నిర్వహిస్తున్న శాఖల్లో బీసీ సంక్షేమాన్ని గంగుల కమలాకర్‌కు, ఎస్టీ సంక్షేమశాఖను సత్యవతి రాథోడ్‌కు కేటాయించారు. మరోమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వద్ద ఉన్న రవాణాశాఖను పువ్వాడ అజయ్‌కి అప్పగించారు. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వద్ద ఉన్న పౌరసరఫరాలశాఖను గంగుల కమలాకర్‌కు కేటాయించారు. చామకూర మల్లారెడ్డి వద్ద ఉన్న మహిళా శిశు సంక్షేమశాఖను సత్యవతి రాథోడ్‌కు కేటాయించారు.
ముగ్గురు మొదటిసారి మంత్రులు క్యాబినెట్ విస్తరణలో మొదటిసారి మంత్రులైనవారు ముగ్గురున్నారు. కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్, గిరిజన నాయకురాలు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తొలిసారి మంత్రి పదవులు పొందారు. కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడిరాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

పూర్తిస్థాయి కొలువు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (ముఖ్యమంత్రి) సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, రెవెన్యూ, నీటిపారుదలతోపాటు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
మహ్మద్ మహమూద్ అలీ హోం, జైళ్లు, అగ్నిమాపకం తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక శాఖ కే తారకరామారావు ఐటీ, కమ్యూనికేషన్, పరిశ్రమలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి
వేముల ప్రశాంత్‌రెడ్డి ఆర్ అండ్ బీ, గృహనిర్మాణం, శాసనసభా వ్యవహారాలు ఎర్రబెల్లి దయాకర్‌రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ
కొప్పుల ఈశ్వర్ ఎస్సీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమం ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అటవీ, దేవాదాయ, న్యాయ, శాస్త్ర సాంకేతికం జీ జగదీశ్‌రెడ్డి విద్యుత్
ఎస్ నిరంజన్‌రెడ్డి, వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, ఉద్యానవన, పట్టుపరిశ్రమ వీ శ్రీనివాస్‌గౌడ్ ఎైక్సెజ్, సాంస్కృతికం, పర్యాటక, క్రీడలు
టీ శ్రీనివాస్‌యాదవ్ పశుసంవర్ధకం, మత్స్య , పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ సీహెచ్ మల్లారెడ్డి కార్మిక, ఉపాధి కల్పన పీ సబితా ఇంద్రారెడ్డి, విద్య
సత్యవతి రాథోడ్ ఎస్టీ, మహిళా శిశు సంక్షేమం గంగుల కమలాకర్ బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా








