ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకృతి ఆరాధకుడు. చెట్టూ పుట్టా మట్టి.. కనిపిస్తే ఆయన పులకించిపోతారు. బుధవారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ విషయం మరోసారి రుజువైంది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై నిపుణులతో చర్చించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన క్యాంపస్‌లోని సహజసిద్ధ ప్రకృతిని చూసి పులకించిపోయారు. అధికారులు వాహనాన్ని సిద్ధంచేసినా కాదని.. పచ్చని చెట్ల గాలిని ఆస్వాదిస్తూ.. కాలినడకన క్యాంపస్ అంతా తిరిగారు.

అరగంట సేపు ఎంసీహెచ్చార్డీలోని వివిధ విభాగాలను సందర్శించారు. సర్పంచుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఇక్కడే శిక్షణ ఇప్పించాలని సీఎం నిర్ణయించుకున్నారు. తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంసీహెచ్‌ఆర్డీ సంస్థను కాపాడటానికి ఆవరణ చుట్టూ ఫెన్సింగ్, ప్రహరీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. సీఎంతోపాటు ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్ జనరల్ లక్ష్మీపార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు ఉన్నారు.