Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పోటాపోటీగా సభ్యత్వాలు

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పోటీపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు రావడంతో అంచనాలకు మించి సభ్యత్వాలు నమోదయ్యాయి. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.

Kalvakuntla Kavitha

అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో రికార్డుస్థాయి సృష్టించింది. కరీంనగర్ జిల్లాలో సభ్యత్వం 5 లక్షలు దాటింది. శుక్రవారం పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మెట్‌పల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని కోరుట్ల నియోజకవర్గంలో లక్ష్యాన్ని మించి సభ్యత్వం పూర్తిచేసినందుకు ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావును, నాయకులను అభినందించారు. కేటీఆర్ వెంట ఎంపీ బాల్క సుమన్ పాల్గొన్నారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, భీమదేవరపల్లిలో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీశ్‌కుమార్, సుల్తానాబాద్ మండలంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, బెజ్జంకి మండలంలో సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 లక్షలు లక్ష్యంగా పెట్టుకోగా శుక్రవారం రాత్రి వరకు 4.5 లక్షలకు చేరుకున్నాయి. శుక్రవారం నిర్మల్‌లోని బుధవార్‌పేటలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్‌లోని షాదీఖానాలో మంత్రి జోగు రామన్న, జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ అక్బర్‌హుస్సేన్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో 6 లక్షలకు చేరువైంది. గ్రేటర్ వరంగల్‌లో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, అర్బన్ పార్టీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో 1.38 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. -అన్ని వర్గాల నుంచి విశేష స్పందన -అంచనాలకు మించి సభ్యత్వాలు నమోదు -ఇతర పార్టీల నుంచి వలసలతో ఆనందంలో శ్రేణులు జిల్లాలో మిగిలిన పది నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు ఒకరుకొకరు అన్నట్లుగా పోటాపోటీగా సభ్యత్వ నమోదును చేశారు. మెదక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రానికి 4.60 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 లక్షల సభ్యత్వాలు టార్గెట్‌గా పెట్టుకోగా ఇప్పటికే లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు అంచనాలకు మించింది. శుక్రవారం నకిరేకల్‌లో జరిగిన సభ్యత్వ నమోదులో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య, దేవరకొండ నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కోదాడలో నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గంలో ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, జిల్లా నాయకులు రేఖల భద్రాద్రి, అభిమన్యు శ్రీనివాస్, బోయనపల్లి కృష్ణారెడ్డి, హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ, సాముల శివారెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇన్‌చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రేటర్‌లో పది లక్షలు దాటిన సభ్యత్వం గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించింది. అన్ని వర్గాల ఆదరణతో పది లక్షలు దాటిన సభ్యత్వంతో కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపింది. ఇప్పటికే తెలంగాణ భవన్‌కు 8,33,550 మంది సభ్యత్వాలకు చెందిన డబ్బులతోపాటు పూర్తి వివరాలను అందించడం ఒక రికార్డుగా చెప్పవచ్చు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు అసలే బలం లేదని చెప్పిన పార్టీలకు దిమ్మతిరిగేలా సభ్యత్వం నమోదు కావడంతో ప్రత్యర్థి పార్టీలు ఆందోళనలో పడ్డాయి. గ్రేటర్‌లో నాలుగు నుంచి ఐదు లక్షల సభ్యత్వం పూర్తయితే చాలనుకున్న టీఆర్‌ఎస్ అధిష్ఠానమే వస్తున్న స్పందనను చూసి ఆశ్చర్య పోయింది. ఉహించిన దాని కన్నా రెట్టింపు కావడంతో శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపోర్లుతున్నది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఎంపీ కవిత, మంత్రి పద్మారావు, స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరిలో గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, అంబర్‌పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాంనగర్‌లో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తదితరులు పాల్గొని సభ్యత్వాలు అందజేశారు.

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం నాటికి 6 లక్షల సభ్యత్వాలు దాటినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఖమ్మం జిల్లాలో శుక్రవారం నాటికి దాదాపు 4.50 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీటిల్లో క్రియాశీలం లక్షా ఒక వెయ్యి, సాధారణం 3,46,200లు సభ్యత్వాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వరకు 5లక్షల 50వేల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి మార్కండేయ వివరించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో సభ్యత్వం 50వేలకు చేరుకుంది. జడ్చర్లలో 61వేలు దాటాయి. షాద్‌నగర్‌లో 38 వేలు నమోదయ్యాయి. వనపర్తిలో నమోదైన సభ్యత్వాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దగ్గరుండి ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇచ్చిన టార్గెట్‌కాన్నా అదనంగా 1,64,375 సభ్యత్వాలు నమోదయ్యాయి. శుక్రవారంతో మొత్తం 4,41,250 సభ్యత్వాలు పూర్తయ్యాయి. ఒకవైపు సభ్యత్వాల జోరు కొనసాగుతుండగా, మరోవైపు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెల్లువలా వచ్చి చేరారు. సభ్యత్వం విషయంలో జిల్లా మూడోస్థానంలో నిలిచేందుకు ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషి చేశారని సభ్యత్వ నమోదు పరిశీలకుడు ఎల్ రూప్‌సింగ్ తెలిపారు.

సినీ కష్టాలు తీరుస్తాం: హోం మంత్రి నాయిని.. టీఆర్‌ఎస్‌లో చేరిన సినీహీరో ఆకాశ్ తెలంగాణలో సినీ రంగం కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఫిల్మ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీహీరో ఆకాశ్ టీఆర్‌ఎస్‌లో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి సభ్యత్వం అందజేశారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ సీని రంగాన్నంతా ఒకే వేదికపై చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇక్కడి 24 క్రాఫ్ట్, సినీ కళాకారులకు అండగా నిలుస్తామన్నారు.

బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. బీజేఆర్‌నగర్ నాయకులు, న్యాయవాది యాదయ్య, టీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ డివిజన్ ఇన్‌చార్జి నర్సింహాతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరిన తెలంగాణ స్టూడియో సెక్టార్ అధ్యక్షుడు సీతారాంయాదవ్, సహ నిర్మాత ఆర్‌కే మీడియా అధినేత రవి పనస, కృష్ణ, డిస్ట్రిబ్యూటర్లు ఉదయ్‌రెడ్డి, పేపర్ సత్యనారాయణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.