Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పరిశ్రమలకు ఏకగవాక్షం

– సీఎం కార్యాలయాన్నే సంప్రదించవచ్చు – కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు – మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మా లక్ష్యం – అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెస్తున్నాం – స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తాం – హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వసతులు – తెలంగాణను సందర్శించండి – పరిశ్రమలకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ – ఏరోస్పేస్‌కు హైదరాబాద్ కేంద్రం – టాటా గ్రూప్ తెలంగాణ అంబాసిడర్.. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధీమా – ఏరోస్పేస్ పార్కులో విమానాల విడి భాగాల కంపెనీకి శంకుస్థాపన

హైదరాబాద్ మహానగరం పెట్టుబడులకు అత్యంత శ్రేయస్కరమైన ప్రాంతం. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకువచ్చే కంపెనీలకు ప్రభుత్వపరంగా అన్నివిధాలా సహకరిస్తాం. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌వంటి అనువైన స్థలం ప్రపంచంలోనే మరెక్కడాలేదు. దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఒకసారి తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించాలి.. అపుడు ఇక్కడున్న సామరస్యపూర్వక వాతావరణం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 20 రోజులే అయింది. ఆయా రంగాల్లో మెరుగైన విధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యాం. తెలంగాణకు అధికంగా పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్నాం. 60 ఏండ్ల ప్రజల కల సాకారమైంది.. అదే తరహాలో అభివృద్ధికి పెద్ద పీట వేసేందుకు కూడా కృషి చేస్తున్నాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అనుమతికి సీఎం కార్యాలయానికి అనుసంధానంగా సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పరిశ్రమల అనుమతుల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. పారిశ్రామికవేత్తలు నేరుగా సీఎం కార్యాలయంతోనే సంప్రదింపులు జరపవచ్చునని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు స్నేహపూర్వక విధానం అనుసరిస్తామన్నారు.

kcr-withtataప్రపంచంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నామని, ఇందుకోసం వివిధ పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యల సలహాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ సందర్శనకు తరలి రావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఆదిభట్ల ఏరోస్పేస్‌లో ఏర్పాటు చేయనున్న విమాన విడిభాగాల తయారీ కంపెనీకి హైదరాబాద్ హైటెక్స్‌లో సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్‌ఎల్), యూరోపియన్ కంపెనీ ఆర్‌ఏయూజీ(రుయాగ్) రూ.500 కోట్లతో ఈ ఏర్పాటు చేసే ఈ కంపెనీలు విమానాలకు అవసరమయ్యే డోర్నియర్ 228, ఫూజ్‌లాగ్, వింగ్స్ తయారు చేస్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మేడిన్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ సాధించాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కృషి జరుపుతున్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్ మహా నగరం పెట్టుబడులకు అత్యంత శ్రేయస్కరమైన ప్రాంతమని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ వంటి అనువైన స్థలం ప్రపంచంలోనే మరెక్కడా లేదని అన్నారు. దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఒకసారి తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించాలని, అపుడు ఇక్కడున్న సామరస్యపూర్వక వాతావరణం అర్థమవుతుందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 20 రోజులే అయిందని, ఆయా రంగాల్లో మెరుగైన విధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యామని ఆయన వివరించారు. తెలంగాణకు అధికంగా పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 60 ఏండ్ల ప్రజల కల సాకారమైంది… అదే తరహాలో అభివృద్ధికి పెద్ద పీట వేసేందుకు కూడా కృషి చేస్తున్నామని చెప్పారు.

విధాన రూపకల్పనలో భాగస్వామ్యం ప్రపంచంలోనే మేడ్ ఇన్ తెలంగాణ అనే బ్రాండ్‌గా ప్రాచూర్యం పొందేందుకు నాణ్యత, నూతన ఆవిష్కరణలకు అనుగుణమైన పారిశ్రామిక విధాన రూపకల్పనకు కృషి జరుపుతున్నామని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రక్రియలో సీఐఐ, ఫ్యాప్సీ, ఎంఎస్‌ఎంఈ తదితర పారిశ్రామిక సంఘాలతో చర్చిస్తామని వివరించారు. తమ లక్ష్యానికి అనుగుణంగా టాటా గ్రూప్ ముందుకొచ్చిందని, ఆ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణకు టాటా గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉందన్నారు. టాటా గ్రూప్‌తో పాటు ఇతర పెట్టుబడి సంస్థలకు తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ బిజినెస్ రెగ్యులేటరీ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తు పెట్టుబడులపై మెరుగైన కాంపిటిటివ్ ఇన్సెంటివ్ ప్యాకేజీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల తరపున టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, రుయాగ్ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. టాటా కంపెనీ ఆదిబట్ల ఎరోస్పేస్ సెజ్‌లో మూడు యూనిట్లను ఏర్పాటు చేసిందని, దేశంలోనే గర్వించదగిన ప్రాజెక్టులు నడుస్తున్నాయని ఆయన చెప్పారు.

పరిశోధనల కేంద్రం తెలంగాణ తెలంగాణ అనేక పరిశోధనలకు కేంద్రంగా విరాజిల్లుతోందని, డీఆర్‌డీఓ, డీఆర్‌డీఎల్, మిథాని, బీడీఎల్, రీసెర్చ్ సెంటర్ ఇమరాత్, బీఈఎల్, హెచ్‌ఏఎల్ వంటి అనేక పరిశోధనాలయాలు ఇక్కడ ఉన్నాయని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే విమాన విడి భాగాల తయారీ, ఏరో స్పేస్ టెక్నాలజీస్‌ను వినియోగించుకోవడానికి ఇంత కంటే మెరుగైన ప్రాంతం మరెక్కడా ఉండదన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఎరోస్పేస్, రక్షణ రంగాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పారిశ్రామిక స్నేహపూర్వక పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమలను నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పని లేదు. సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో స్పెషల్ చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఐటీఐఆర్ అథారిటీ కింద ఇది పని చేస్తుందని ప్రకటించారు. పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే వారు ప్రతిపాదనలతో వస్తే చాలునన్నారు.

దీర్ఘ కాల లబ్ధి కోసం..: టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్‌తో తాము డోర్నియర్ 288 ప్రోగ్రాంకు భవిష్యత్తులో సరైన భాగస్వామిగా టాటా గ్రూప్‌ను గుర్తించినట్లు యురోపియన్ రుయాగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ బుహ్లామాన్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో టాటా గ్రూప్‌కు ఉన్న బలమైన ట్రాక్ రికార్డు ఏవియేషన్ రంగంలోనూ ప్రపంచ అగ్రశ్రేణి తయారీ కంపెనీగా నిలువాలన్న కోరికతోనే భాగస్వామిగా చేరినట్లు చెప్పారు. టాటా, రుయా ఏవియేషన్ దీర్ఘకాలం ప్రయోజనాలను అందిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ చైర్మన్ ఎస్ రామదొరై మాట్లాడుతూ నాల్గో అతి పెద్ద ఎరోస్పేస్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.

ఇండియా, యూరోప్ దేశాల్లో ప్రపంచ స్థాయి క్వాలిటీ, హై స్కిల్స్ ఉన్నాయని కొనియాడారు. తాము ఇప్పటికే 70 సికోర్క్సి ఎస్-92 క్యాబిన్స్‌ను తయారు చేశామని ఇపుడు డోర్నియర్ 228 రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన కేంద్రంగా కొనియాడారు. తమకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.