Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పల్లె పోరులో..గుబాళించిన గులాబీ

-తెలంగాణలో దూసుకుపోయిన టీఆర్‌ఎస్ -జెడ్పీటీసీల్లో అధిక స్థానాలు కైవసం -ఖమ్మం, నల్లగొండ మినహా అన్ని జిల్లాల్లో హవా -మూడు జెడ్పీలు కైవసం, మరో రెండింటిపై గురి -కాంగ్రెస్‌కు దక్కిన నల్లగొండ, రంగారెడ్డి జెడ్పీలు -ఎంపీటీసీల్లో ఆధిక్యం -ఖమ్మంలో తెలుగుదేశం ఏకపక్ష విజయం -ప్రభావంచూపని బీజేపీ, వామపక్షాలు

KCR 1111

ఇక దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా నిలిచింది. కాగా కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానానికి పరిమితమైంది. జెడ్పీటీసీలో161 సీట్లు, ఎంపీటీసీల్లో 2233 సీట్లు సాధించింది. ఎంపీటీసీల్లో స్వల్ప ఆధిక్యం కనబరిచినా జెడ్పీటీసీల్లో వెనుకబడింది. మొత్తం 9 జిల్లా పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో ఒక్క నల్లగొండ జిల్లా జెడ్పీని మాత్రమే స్పష్టమైన ఆధిక్యతతో గెలుచుకుంది. రంగారెడ్డిని పోటాపోటీ ఎన్నికల్లో నిలబెట్టుకుంది. మహబూబ్‌నగర్‌లో మెజారిటీ సీట్లకు దగ్గరలో ఆగిపోయింది. ఇలాఉంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో అనేక జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఖమ్మం జిల్లా మినహా ఏ జిల్లాలోనూ రెండంకెల జెడ్పీటీసీ స్థానాలు సాధించలేకపోయింది. నిజామాబాద్ జిల్లాలో ఒక్క జెడ్పీటీసీ కూడా గెలువలేక పోయింది. ఇక బీజేపీ ఏడు జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీ కూడా గెలువలేకపోయింది. ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నిజామాబాద్ జిల్లాలో ఒక్క జెడ్పీటీసీని కూడా గెలవకపోవడం విశేషం. వామపక్షాలు అక్కడక్కడా తమ ఉనికిని చాటుకున్నాయి. ఇక జిల్లాలవారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. జిల్లాలోని 52 జెడ్పీటీసీల్లో 38 జెడ్పీటీసీలు గెలిచి జిల్లాపరిషత్ పీఠం కైవసం చేసుకుంది. 633 ఎంపీటీసీలకు గాను 298 ఎంపీటీసీలు గెలుచుకుంది. మొత్తం 52 మండల పరిషత్‌లలో 30 మండల పరిషత్‌లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 10 జెడ్పీటీసీ స్థానాలు, 161 ఎంపీటీసీ, 6 ఎంపీపీలు గెలిచింది. తెలుగుదేశంకు 2 జెడ్పీటీసీలు, 63 ఎంపీటీసీలు మాత్రమే దక్కాయి. బీఎస్పీ 1, ఎంఐఎం 2 ఎంపీటీసీలు గెలిచాయి. ఇక కరీంనగర్ జిల్లాలో కూడా గులాబీ పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాల్లో ఏకంగా 41 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ 14, టీడీపీ, బీజేపీ చెరొక స్థానం గెలిచాయి. 817 ఎంపీటీసీలకు 347 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ 281 ఎంపీటీసీలు గెలుచుకోగా 30 స్థానాల్లో టీడీపీ, 56 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా 103 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లాలో 36 జెడ్పీటీసీల్లో 24 స్థానాలను టీఆర్‌ఎస్, 12 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. టీడీపీ, బీజేపీ ఖాతా తెరువలేదు. ఇక ఎన్నికలు జరిగిన 581 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 237, కాంగ్రెస్‌కు 227, బీజేపీకి 34, టీడీపీకి 30, మజ్లిస్‌కు 2 స్థానాలు దక్కాయి. మరో 51చోట్ల స్వతంత్రులు గెలిచారు.

మెదక్ జిల్లాలో 46 జడ్పీ స్థానాలకు గాను 21 స్థానాలను కాంగ్రెస్, మరో 21 స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీలు కైవసం చేసుకున్నాయి. మరో 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక ఫలితం వెల్లడి కావల్సి ఉంది. మహబూబ్‌నగర్‌లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్‌ఎస్ పోటీపోటీగా నిలిచాయి. ఇక్కడ 64 స్థానాల్లో కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించగా, టీఆర్‌ఎస్‌కు 24, బీజేపీ 2, టీడీపీ 9 స్థానాల్లో గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గర్లో కాంగ్రెస్ నిలిచిపోయింది.

ఇక్కడ టీడీపీ మద్దతు కీలకం కానుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. కాంగ్రెస్ 35 జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకోగా, టీఆర్‌ఎస్ 12, టీడీపీ 1 స్థానాలు దక్కించుకున్నాయి. మిగతా పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. అలాగే 835 ఎంపీటీసీ స్థానాల్లో 396 స్థానాలు కాంగ్రెస్, 133 స్థానాల్లో టీడీపీ, 131 స్థానాల్లో టీఆర్‌ఎస్, 15 స్థానాల్లో బీజేపీ, 55 స్థానాల్లో సీపీఎం, 19 స్థానాల్లో సీపీఐ, 9 స్థానాల్లో వైసీపీ, 74 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక వరంగల్ జిల్లాలో ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగింది. అందిన ఫలితాల ప్రకారం జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 20, కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచారు. టీడీపీ 4, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు.

ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్ 169 కాంగ్రెస్ 172 సీట్లు గెలిచాయి. టీడీపీ 74 ఇతరులు 34 సీట్లలో విజయం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రాతినిథ్యం వహించిన భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రమైన భూపాలపల్లి జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌కు చెందిన జరుపుల మీరాబాయి 1319 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి లావుడ్య కల్పనపై విజయం సాధించారు. ఇక ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో టిడిపి 148, కాంగ్రెస్ 41, సిపిఐ 18, స్వతంత్రులు 23, సిపిఎం 46, వైసిపి 60 స్థానాలు గెలుచుకున్నారు. జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ 8, టీడీపీ 17, వామపక్షాలు 3, ఇతరులు 7స్థానాల్లో గెలిచారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.