-ప్రమాణం చేయించిన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్
-శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఏడుగురు సోమవారం ప్రమాణంచేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తన చాంబర్‌లో వీరితో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన టీఆర్‌ఎస్ సభ్యులు మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, ఎంఐంఎం సభ్యుడు ఇఫెండి, టీచర్స్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘోత్తంరెడ్డి ప్రమాణ స్వీకారంచేశారు. మహమూద్ అలీ, ఇఫెండి ఉర్దూలో, మిగిలిన వారు తెలుగులో దైవసాక్షిగా ప్రమాణంచేశారు. నూతన ఎమ్మెల్సీలకు శాసనమండలి నిబంధనల పుస్తకాలు, భారత రాజ్యాం గం, ఇతర సమాచారాన్ని పొందుపర్చిన కిట్ బ్యాగ్‌ను, గుర్తింపు కార్డును అందజేశారు.
ఎమ్మెల్సీలకు నేతి విద్యాసాగర్, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మంత్రులు అల్లోల ఇం ద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, మాజీ మం త్రులు టీ హరీశ్‌రావు, కడియం శ్రీహరి, మండలి విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, బాల్క సుమన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.



