టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వాడవాడల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఊరూరా తిరుగుతూ టీఆర్‌ఎస్ సభ్యత్వాలు నమోదుచేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించి పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారని పలువురు నేతలు పేర్కొన్నారు.

ఆదివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఊరూరా తిరుగుతూ సభ్యత్వాలు నమోదు చేయించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మహబూబ్‌నగర్‌లో మంత్రి లకా్ష్మరెడ్డి సభ్యత్వాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి అజ్మీరా చందూలాల్, నిజామాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌లో మంత్రి పద్మారావు, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్ అర్బన్ జిల్లా వేలేరులో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

ఎక్లాస్‌పూర్‌లో వంద శాతం కోటగిరి: టీఆర్‌ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు పల్లెల్లో విశేషస్పందన లభిస్తున్నదని, ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంలో 20గ్రామాల్లో వందశాతం సభ్యత్వం నమో దైందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రక టించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్‌పూర్‌లో సభ్యత్వ నమోదులోపాల్గొన్నారు. వందశాతం పూర్తికా వడంతో గ్రామస్తులను అభినందించారు.

బాల్కొండ గ్రామాల్లో ఏకగ్రీవంగా మద్దతు రాష్ర్టాన్ని సాధించిపెట్టిన టీఆర్‌ఎస్‌కు, ఉద్యమనేత కేసీఆర్‌కు, ఉద్యమకాలం నుంచి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అదరణ కొనసాగుతూనే ఉన్నది.ఇప్పటికే బస్సాపూర్, చాకిర్యాల్, మోతె, ఏర్గట్ల, కుక్కునూరు గ్రామాలవాసులు వందశాతం టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఉద్యమ సమయంలో ఏకగ్రీవ తీర్మా నంతో టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు అండగా నిలిచిన వేల్పూరు మండలం మోతెవాసులు నేడు సైతం అదే తోడ్పాటు అందిస్తున్నారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఈ నెల 22 న ఊరంతా సభ్యత్వం తీసుకొని టీఆర్‌ఎస్ వెంటే ఉంటామని ప్రతినబూనారు. ఈ నెల 20న బాల్కొం డ మండలం బస్సాపూర్ గ్రామమంతా సభ్యత్వం తీసుకున్నది. తమ నీటి కష్టాలు తీర్చే ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతాపూర్వకంగా ఈ గ్రామం అంతా టీఆర్‌ఎస్‌లో చేరింది. మెండోరా మండలం ఏర్పాటు చేసినందుకు, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందుకు 21న ఆ గ్రామమంతా టీఆర్‌ఎస్ సభ్యత్వం పొందింది. ఉమ్మడి రాష్ట్రంలోనే మండలంగా ఏర్పడాల్సిన ఏర్గట్ల రాజకీయ కారణాలతో అది సాధ్యంకాలేదు. స్వరాష్ట్రంలో ఏర్గట్ల మండల కేంద్రమైంది. దీంతో ఆ గ్రామంతా ఈ నెల 23న టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నది. పెద్దవాగు పక్కనే ఉన్నా తాగునీరందక దశబ్దాలుగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపొయిన వేల్పూరు మండలంలోని కుక్కునూరు గ్రామానికి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం సాధించిపెట్టారు. దీంతో గ్రామస్థులంతా ఈనెల 24న గులాబీ సభ్యత్వం తీసుకొన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభమైన్పటి నుంచి ఇలా గ్రామాలకు గ్రామాలే గులాబీ గూటికి చేరిపొతూ టీఆర్‌ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి.
రెండింతలు ప్రజాసేవ చేస్తా: ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటూ నాలో కొత్త స్ఫూర్తిని నింపుతున్నారు. ఊర్లకు ఊర్లు ఏకమై సభ్యత్వం తీసుకుంటూ ప్రభుత్వానికి, నాకు అండగా నిలుస్తున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో రెండింతల ప్రజా సేవ చేస్తా. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఎంపీ కవిత చేస్తున్న అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారు. ఈ పరిణామాలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాయి. బస్సాపూర్‌లో రూ.4 కోట్లతో లిఫ్టు చేపట్టడం, చాకిర్యాలలో 1.25 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం, సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మోతె మొదటి నుంచి టీఆర్‌ఎస్‌కు ఆయువు పట్టుగా ఉండటం, ఏర్గట్లను మండల కేంద్రం చేయడం, కుక్కునూరులో రూ.5 కోట్లతో లిఫ్టు ఏర్పాటు చేయడం.. ఇలా ప్రతి గ్రామంలో అభివృద్ధికి టీఆర్‌ఎస్ నాంది పలికింది. దానికి ఇప్పుడు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.