Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మోసపోతే తెలంగాణ మళ్లీ గోసపడుడే

ఇవి ఎన్నికలు కావు బతుకు పోరాటం.. తెలివితో ఓటేస్తేనే తెలివైన ప్రభుత్వం వస్తది
మళ్లా పైరవీల, దళారుల రాజ్యం కావాల్నా?
3 గంటల కరెంటుతో చీకట్ల పాలవుదామా?
కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో 2వేల పింఛన్‌ ఇస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటై కుట్రలు చేస్తున్నయ్‌
ఉద్యమం చేసిందెవడు..? ఆంధ్రోళ్ల బూట్లు మోసిందెవడు? తుపాకీ ఎక్కుపెట్టిందెవడు?
మొరిగే పిచ్చి కుక్కల్ని పట్టించుకుంటమా?
పిండం ఎవరికి పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తరు
చేర్యాల ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్‌

ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ అంటే ఓ కరువు ప్రాంతమని, ఒడ్లు పండని నేల అని ముద్ర వేశారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి నేడు అదే నేలలో కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండుతున్నదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పేగులు తెగేటట్టు కొట్లాడిన ఉద్యమకారులను.. నాడు సమైక్యవాదుల చెప్పులు మో సినవారు ఇప్పుడు నోటికొచ్చినట్టు తిడుతుం టే ఊరుకుందామా? అని ప్రజలను ప్రశ్నించా రు. చేర్యాలలో శనివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణలో ఏడ చూసినా ఇప్పుడు డాంబర్‌రోడ్లు మొత్తం వడ్ల కుప్పలేనని, ఈ వడ్ల కుప్పలన్ని ఏడికెళ్లి వచ్చినయ్‌? కాంగ్రెసోడి అయ్య తెచ్చిండా? అని నిలదీశారు. ఆం ధ్రోళ్ల బూట్లు మోసుకుంట తిరిగి, ఆ రోజు చం ద్రబాబు నాయుడి చంచాగిరీ చేసుకుంట ఉం డి, తెలంగాణ ఉద్యమ నాయకులను తిడతా అంటే మర్యాదనా? అని ఆగ్రహోదగ్ధులయ్యా రు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లా దళారుల రాజ్యం వస్తుందని, చీకటి రోజులే దిక్కవుతాయని హెచ్చరించారు. ఇది ఎన్నిక కాదని, తెలంగాణ బతుకుపోరాటమని, ఆలోచించి ఓటేయాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

రైఫిల్‌రెడ్డికి సిగ్గుందా?
మొన్న జనగామలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో తెలుసా? తెలంగాణ ఉద్యమం చేసేటోడు ఎవడని రైఫిల్‌ పట్టుకుని కరీంనగర్‌ మీదకు పోయిండు. ఆ రోజు నుంచి వాడి పేరును ప్రజలే రైఫిల్‌రెడ్డి అని పెట్టిన్రు. వీళ్లు ఇయ్యాల మాట్లాడడానికి సిగ్గుండాలె కదా? నువ్వు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంట ఉన్నోడివి.. తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడిన ఉద్యమకారులను, నాయకత్వం వహించి, ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్‌ను తిడతా అంటే మర్యాదనా? కేసీఆర్‌కు పిండం పెట్టాలంటడు. ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయించాలి.

– సీఎం కేసీఆర్‌

పార్టీల చరిత్రను చూడండి
ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు, అబాంఢాలు, బట్టకాల్చి మీదేసుడు, కొట్లాటలు, దా డులు, కత్తులతో పోడుచుడు.. అంతా కండ్లారా చూస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అమెరికాలాంటి దేశాల్లో అవేవీ ఉండవని, పార్టీల పాలసీల మీదనే ఓట్లు వేస్తారని తెలిపారు. మనదేశంలో అలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు.

బచ్చన్నపేట చౌరస్తల ఏడ్చిన..
తెలంగాణ రాకముందటి తెలంగాణ, వచ్చి న తర్వాత పదేండ్ల తెలంగాణ ఎట్ల ఉన్నదో ఆలోచన చేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎన్నోసార్లు చేర్యాల నుంచి జనగామ, సూర్యాపేట- కోదాడ వరకు పోయానని, కానీ అక్కడి చెరువుల్లో ఎన్నడూ చారెడు నీళ్లు ఉండేవి కాదని గుర్తుచేశారు. ‘ఒకనాడు బచ్చన్నపేట మండలం మీదుగా వెళ్తున్న. మా ర్గమధ్యలో మీటింగ్‌లో మాట్లాడాలని నా మిత్రులు కోరితే కారు ఆపి ఒక మీటింగ్‌లో పా ల్గొన్న. ఆ మీటింగ్‌లో ఒక్క యువకుడు కూడా లేడు. అందరూ ముసలివాళ్లే. ఏమైందయ్యా ఒక్క యువకుడు కూడా లేడని అడిగిన. ఎక్క డ సార్‌.. 9 ఏండ్ల నుంచి కరువు.. మొత్తం బతకపోయిన్రు అని చెప్పిన్రు. ముసలోళ్లతో మాట్లాడితే మంచినీళ్లు కూడా దొరుకుతలేవు. మూడునాలుగు కిలోమీటర్ల నుంచి ఎడ్ల బండ్లమీద తెచ్చుకుంటున్నం. ఏడేండ్లాయె మా చెరు వు ఎండిపోయి. బతకలేని పరిస్థితి అని చెబితే నేను ఏడ్చిన. ఏం గోస తెలంగాణకు! కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉండి ఇంత అన్యాయానికి గురైతే ఏ జాతి అయినా ఊకుంటదా అని బచ్చన్నపేట చౌరస్తాలో ఏడ్చిన’ అని గుర్తుచేసుకున్నారు.

‘తెలంగాణ కోసం కొట్లాడిందెవడు? ఉద్యమం మొదలుపెట్టినోడు ఎవ డు? ప్రాణాలకు తెగించి పేగులు తెగేదాకా జై తెలంగాణ అని నినాదం చెప్పి తెలంగాణ సా ధించిందెవడు? సాధించిన తెలంగాణను దేశం లో నంబర్‌ వన్‌ చేసిందెవడు? 24 గంటల కరెంటు తెచ్చినోడు ఎవడు? ఇయ్యాల ప్రతి ఇంట్లకు తాగునీళ్లు, సాగునీళ్లు తెచ్చినోడు ఎవ డు? యాళ్లకు మేమొచ్చి ఇ వాల వడ్డన చేత్తం అంటరా? సాయి సంసారి లచ్చి దొంగ అనే లఫంగ మాటలు మాట్లాడుకుంట ఎవలను గోల్‌మాల్‌ చేస్తరు?’ అని మండిపడ్డారు..

తెలంగాణ కోసం కొట్లాడిందెవడు? ఉద్యమం మొదలు
పెట్టినోడు ఎవడు? ప్రాణాలకు తెగించి పేగులు తెగేదాకా
జై తెలంగాణ అని నినాదం చెప్పి తెలంగాణ సాధించిందెవడు?

– సీఎం కేసీఆర్‌

పిచ్చికుక్కలు మత్తుగ ఒర్రుతయ్‌..
‘వాడెవడో జనగామకు వచ్చి వొర్రిపోయిండట, పిచ్చి కుక్కలు మత్తుగ ఒర్రుతయ్‌. దాన్ని లెక్కపెడదామా? నిన్న జనగామలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో తెలుసా? తెలంగాణ ఉద్యమం చేసేటోడు ఎవడని రైఫిల్‌ పట్టుకుని కరీంనగర్‌ మీదకు పోయిండు. ఆ రోజు నుంచి ఆని పేరును ప్రజలే రైఫిల్‌రెడ్డి అని పెట్టిన్రు. ఇ య్యాల వచ్చి మాట్లాడితే సిగ్గుకూడా ఉండాలె కదా? నువ్వు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంట ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడి చెంచాగిరి చేసుకుంట ఉండి, అనాడు పేగులు తెగేదా కా కొట్లాడిన రాజేశ్వర్‌రెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులకు నాయకత్వం వహించి, ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్‌ను తిడతా అంటే మర్యాదనా? కేసీఆర్‌కు పిండం పెడతా అంటడు. ఎవనికి పిండం పెట్టాలో మీరు (ప్రజలు) నిర్ణయించాలి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

పట్టించుకున్న గాడ్దికొడుకు ఎవడు?
తెలంగాణ వచ్చిన రోజున చెట్టుకొకలం, పుట్టకొకలం బతకపోయి ఉన్నామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. ‘ఎన్నిగోసలు పడ్డం! ఎటువంటి నమూనాలు చూసినం కాంగ్రెస్‌ రాజ్యం ల! ఎన్ని ఏడ్పులు ఏడ్చినం! మనం గొడగొడ ఏడ్చినా ఎవడన్న పట్టించుకున్నడా? ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే ఎన్ని బాధలు పడ్డం. ఎన్ని లంచాలు ఇచ్చినం. ఏ గాడ్దికొడకన్న పట్టించుకున్నడా మనల్ని? ఇయ్యాల వచ్చి మాట్లాడతరా వీళ్లు? తెలంగాణను పీడించుకుని తిని, మనల్ని బొంబాయి బతకపోయేట్టు చేసి, అన్నం పెట్టే రైతును పురుగుమందు తాగేట్టు చేసి తెలంగాణను సర్వనాశం చేసింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? మళ్లా ఇయ్యాల వచ్చి టక్కులు చెబుతం.. నీతులు చెబుతం అంటే మనం ఏమన్న గోషిగాళ్లమా? దయచేసి ఆలోచన చేయాలె’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

24 గంటల కరెంటు తెచ్చినోడు ఎవడు? ఇయ్యాల ప్రతి ఇంట్లకు తాగునీళ్లు, పంటలకు సాగునీళ్లు తెచ్చినోడు ఎవడు? యాళ్లకు మేమొచ్చి ఇవాల వడ్డన చేత్తం అంటరా?

– సీఎం కేసీఆర్‌

వడ్లు కాంగ్రెసోడి అయ్య తెచ్చిండా?
బంగారంలాంటి తెలంగాణకు వెనుకబడిన ప్రాంతం అని ముద్రవేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘ప్లానింగ్‌ కమిషన్‌ రిపోర్ట్‌లో, ఎక్కడైనా పోయినా, ఢిల్లీలో మాట్లాడినా తెలంగాణ అంటే బ్యాక్‌వర్డ్‌ ఏరియా. తెలంగాణ అంటే కరువు ప్రాం తం. తెలంగాణ అంటే మీకు వడ్లు పండయ్‌. ఇదీ మనకు అంటేసిన లేబుల్‌. 50 ఏండ్ల కాంగ్రెస్‌ ఘనత ఇది. ఇయ్యాల మరి తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను కూడా తలదన్ని ఏటా మూడు కోట్ల టన్నుల వడ్లను పండిస్తున్నది. ఎక్కడ చూసినా పొలాలే. కోయడానికి మిషన్లు, ఎత్తడానికి హమాలీలు చాలడం లేదు. బీహార్‌ నుంచి కూలీలు వస్తున్నారు. తరలించడానికి లారీలు, పట్టడానికి గిర్నీలు సరిపోతలేవ్‌. తెలంగాణ ఏడ చూసినా డాంబర్‌ రోడ్లుపై వడ్ల కుప్పలే. మరి ఈ వడ్ల కుప్పలన్నీ ఏడికెళ్లి వచ్చినయ్‌? కాంగ్రెసోడి అయ్య తెచ్చిం డా? ఎవలు తెచ్చిండ్రు ఈ వడ్లన్ని? అంత కండ్ల ముంగట కనవడుతుండగా దీన్ని మా యమశ్చీంద్రం చేస్తం.. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు మాట్లాడుతం అంటే నడుస్తదా ? అంత అల్కగ ఉన్నదా? అంత ఎడ్డోళ్లమా మనం?’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెసోడు గెలిస్తే రైతుబంధు పోతుందని, దీనిని ప్రజలు గమనించాలని హెచ్చరించారు.

ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం

జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల, నవంబర్‌ 18: ఉద్యోగాల నియామకాలపై కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ పార్టీ జనగామ అభ్యర్థ్ధి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. చేర్యాల ప్రజాఆశీర్వాద సభలో పల్లా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వరంగంలో 1.73 లక్షల (పోలీస్‌, వ్యవసాయశాఖ, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్తు తదితర రంగాల్లో) ఉద్యోగాలను భర్తీ చేశారని వివరించారు. ప్రైవేటు, ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి మరో 6 లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాయడంతోనే రైతుల రుణమాఫీ, పంట నష్టపరిహారం పంపిణీ నిలిచిపోయాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తొలి నుంచి చేర్యాల, జనగామ ప్రాంతాలు సీఎం కేసీఆర్‌ వెంటే నడిచాయని, జనగామ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్‌ అంటే అమితమైన ప్రేమ ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ పాలనలో కొమురవెల్లి ఎంతో ప్రగతి సాధించి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదుగుతున్నదని చెప్పారు. చేర్యాలరెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ధరణి తీసేస్తే మళ్లీ పాతకథే
‘అన్నింటికంటే ప్రమాదకరమైన మాట. నిన్న భట్టి విక్రమార్క ఓ టీవీ చానల్‌ చర్చలో చెప్పిండు.. ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తం.. మళ్లా పాత పద్ధతి తీసుకొస్తం అంటున్నడు. అంటే మళ్లా వీఆర్వోలు, గిర్ధావర్లు వస్త రు. ఇయ్యాల ధరణి ఉన్నది. మీ భూములు సేఫ్‌గా ఉన్నయ్‌. ప్రభుత్వం దగ్గర ఉన్న భూ మార్పిడి అధికారాన్ని తీసి మీ బొటన వేలికి ఇచ్చినం. ఒకసారి రైతు భూమి ధరణిలోకి వస్తే మార్చే అధికారం సీఎంకు కూడా లేదు. మునుపు ఎట్లుండె? రిజిస్ట్రేషన్లకు పోతే ఎంత బాధ ఉండె? ఇయ్యాల వెంటనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అవుతున్నాయి. మళ్లా అన్ని కాల మ్స్‌ పెడతరట. అంటే భూమి రైతు ఎవరికీ కౌ లుకు ఇవ్వకుండా.. మళ్లా పడావు పెట్టేట్టు, మ ళ్లా తెలంగాణ కిందికి పోయేట్టు, మళ్లా దళారీ రాజ్యం వచ్చేట్టు చేస్తామని బాజాప్తా చెప్తున్నరు కాంగ్రెసోళ్లు’ అని నిప్పులు చెరిగారు.

రాజేశ్వర్‌రెడ్డిని ఆశీర్వదించండి
చేర్యాల బాగా చైతన్యమున్న గడ్డ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రాంతం తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడికి వస్తే తన సొంతూరికి వెళ్లినట్టు ఉంటదని చెప్పారు. జనగాంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే నెలరోజుల్లోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ చేసి ప్రారంభించే బాధ్య త తనదేనని హామీ ఇచ్చారు. ‘రాజేశ్వర్‌రెడ్డి ఎం త కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తో ముందుముందు మీరే చూస్తరు. ఆయన సేవలు మీరు అందుకుంటరు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మించి పనేచేసే తెలివితేటలు ఉన్నయ్‌ అని మీరే అంటరు’ అని సీఎం తెలిపారు. ‘మల్లన్నసాగర్‌ 50 టీఎంసీల ప్రాజెక్టు నిండుకుండలా చేర్యాల నెత్తిమీదనే ఉన్నది. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు రూ.350 కోట్లు కేటాయించాం. ఆ కాల్వ, పైప్‌లైన్‌ పూర్తవుతున్నది. పనులు పూర్తయితే బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి. చేర్యాల ఏరియాలో కరువు అనేది మళ్లీ అడుగు పెట్టకుండ చూసే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌కు పిండం పెడతా అంటడు. ఎవనికి పిండం పెట్టాలో మీరు (ప్రజలు) నిర్ణయించాలి .

-సీఎం కేసీఆర్‌

పుంగి బజాయిస్తననే కాంగ్రెస్‌, బీజేపీకి భయం
రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్‌ను చూస్తే భయమైతున్నదని సీఎం ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్‌ తెలంగాణ ఎన్నికల్లో నెగ్గితే మహారాష్ట్రలో వచ్చి పడతడు. మా పుంగి బజాయిస్తడు అని తెలుసు వాళ్లకు. మహారాష్ట్రకు చెందిన 150 గ్రామ పంచాయతీలు మమ్మల్ని తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేసినయ్‌. మహారాష్ట్రకు నేను పోతే గాలి గత్తర ఉన్నదక్కడ. అక్కడ సభ పెట్టినా మన దగ్గర ఎట్లొస్తరో అట్లొస్తున్నరు. అందుకే భయపడి చీకట్లో ఇద్దరూ ఏకమయ్యారు. కాంగ్రెస్‌ గెలవాలని బీజేపీ బలహీనమైన అభ్యర్థిని పెడితే, బీజేపీ గెలవాలని కాంగ్రెస్‌ బలహీనమైన అభ్యర్థిని పెడుతున్నది. ఈ లఫంగి దందా అంతా కట్టి కేసీఆర్‌ బొండిగ ఇక్కడనే పిసికేస్తే మనం సేఫ్‌గా ఉంటాం అనే కుట్రలు చెస్తున్నరు. రాజకీయాల్లో తెలివితో ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతున్నదో ఆలోచించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ రాష్ట్రాల్లో రూ.2 వేల పింఛన్‌ ఇస్తే ముక్కు నేలకు రాస్తా..
ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే అలవా టు తమకు లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ‘ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేల పింఛన్‌ ఇస్తే నేను ఇక్కడే ముక్కునేలకు రాస్తా. మన పక్కన కర్ణాటకలో మొన్న గెలిచారు. ఇస్తున్నారా? హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నదా? రాజస్థాన్‌లో ఉన్నదా? ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నదా? మరి ఈడికి వచ్చి నాలుగు వేలు ఇస్తం అంటడు.. ఇస్తడా? గత 50 ఏండ్లలో వాళ్లు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రో చూడలేదా? వీళ్ల చరిత్ర మన దగ్గర లేదా? అంత చూసుకుంట మల్ల గోల్‌ తిప్పుదామంటే అంత ఈజీగా గోల్‌ అయితదా తెలంగాణ?’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.