Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేంద్రంలో నిర్ణయాత్మక శక్తి మనమే కావాలి

-16 ఎంపీ స్థానాలు గెలిస్తే..కేంద్రంలో నిర్ణయాత్మక శక్తి మనమే -దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు -దేశానికి కొత్త నమూనా అందిస్తున్న నేత సీఎం కేసీఆర్ -మోదీ పాలనలో సామాన్య ప్రజలకు ఒరిగింది శూన్యం -ఏదో చేస్తాడనుకుంటే పోపుడబ్బాల్లో పెద్ద నోట్లు తీశాడు -కేసీఆర్ వల్లే దేశంలో 13 కోట్ల మంది రైతులకు లబ్ధి -మెదక్, మల్కాజిగిరి సన్నాహక సమావేశాల్లో -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు -బావ బావమరుదుల సవాలుకాదు.. నేరుగా సీఎంతోనే పోటీ -మెదక్ సభలో కేటీఆర్ స్నేహపూర్వక సవాల్

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలను టీఆర్‌ఎస్, హైదరాబాద్ సీటును మిత్రపక్షం ఎంఐఎం గెలుచుకుంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు సాధించుకోవచ్చని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. ఈ దిశగా అన్ని ఎంపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ నాశనం చేస్తే.. దేశానికి కొత్త నమూనా అందించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. అనేక పథకాలను దేశానికి పరిచయం చేశారని తెలిపారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. గోల్కొండపై ఇప్పుడు సీఎం కేసీఆర్ జెండా ఎగురవేస్తున్నారని, రేపు హస్తినలోని ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో కూడా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి మైదానంలో, సాయంత్రం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్ మెదక్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజలకు మోదీ ఏదో ఉద్ధరిస్తాడని 2014 ఎన్నికల్లో 283 సీట్లు కట్టబెడితే.. అక్కాచెల్లెళ్లు పోపుడబ్బాల్లో దాచుకున్న పెద్దనోట్లను ఆయన బయటకు తీశాడని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్‌తో ఏమైతదని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. గత అ సెంబ్లీ ఎన్నికలకు ముందుకూడా వారు ఇలాగే మా ట్లాడి 103 స్థా నాల్లో డిపాజిట్ కో ల్పోయారని ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంద్వారా దేశంలో 13 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారంటే అది కేసీఆర్ వల్లేనని స్పష్టంచేశారు. గతంలో బెంగాల్ ఏం ఆలోచిస్తే దేశం అదే ఆలోచిస్తుందనేవారని, కానీ.. ఇప్పుడు అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలను టీఆర్‌ఎస్, హైదరాబాద్ సీటును మిత్రపక్షం ఎంఐఎం గెలుచుకుంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి, కేంద్రం మెడలు వంచి రాష్ర్టానికి నిధులు సాధించుకోవచ్చని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. ఈ దిశగా అన్ని ఎంపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ నాశనం చేస్తే.. దేశానికి కొత్త నమూనా అందించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. అనేక పథకాలను దేశానికి పరిచయం చేయడంతో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీవాళ్లు కూడా కేసీఆర్‌కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న కేటీఆర్.. వారిని ఓటడిగే విషయంలో భేషజాలకు పోవద్దని కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి మైదానంలో, సాయంత్రం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజలను మోదీ ఉద్ధరిస్తాడని అపోహ పడి 2014 ఎన్నికల్లో 283 సీట్లు కట్టబెడితే.. అక్కాచెల్లెళ్ల పోపుడబ్బాల్లో దాచుకున్న పెద్దనోట్లను బయటకు తీశాడని ఎద్దేవాచేశారు. మోదీ హయాంలో సామాన్యుడికి ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏలు ప్రభుతాన్ని ఏర్పాటుచేసే పరిస్థితిలేదని స్పష్టంచేశారు. గోల్కొండపై ఇప్పుడు సీఎం కేసీఆర్ జెండా ఎగురవేస్తున్నారని, రేపు హస్తినలోని ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో కూడా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

కేంద్రంలో బడితె ఉన్నోడిదే బర్రె.. బడితె ఉన్నోడిదే బర్రె అన్నట్టు కేంద్రంలో వ్యవస్థ మారిందని కేటీఆర్ చెప్పారు. రైల్వేమంత్రిగా పనిచేసిన మమతాబెనర్జీ బెంగాల్‌కు రైళ్లు తీసుకువెళ్ళారు. లాలూప్రసాద్ తన అత్తగారి ఊరికి రైలుమార్గం వేసుకున్నారు. టీఆర్ బాలు జాతీయ రహదారులను తమిళనాడుకు తీసుకెళ్లారు. ప్రధాని మోదీ గుజరాత్‌కు చెందినవారు కావడంతో బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి గుజరాత్, ముంబై వెళ్లింది తప్ప తెలంగాణకు రాలేదు అని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో ైఫ్లె ఓవర్లు కడుదామంటే మిలిటరీవాళ్లు జాగా ఇయ్యరు. ఆ జాగాలు రాష్ట్ర ప్రభుత్వానివి. వాళ్ల దాదాగిరి ఏంది? రేపు నిజంగానే వాళ్ల జుట్టు కేసీఆర్ లాంటి నాయకుడికి దొరికిందనుకో దెబ్బకు రాదా ైఫ్లెఓవర్? ఎంఎంటీఎస్ మరిన్ని మార్గాలకు, మెట్రోరైలు కొంపల్లి దాకా తీసుకురావాలంటే కేంద్రం నుంచి డబ్బు తెచ్చుకుంటే పెద్ద పనికాదు. ఇవన్నీ కావాలంటే ఢిల్లీలో పేగులు తెగేదాకా కొట్లాడేటోళ్లు ఉండాలి అని చెప్పారు.

మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ పథకాలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే మోదీ 24 పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో కేంద్రం జుట్టు మన వద్ద ఉంటే రూ.24 వేల కోట్లు తన్నుకుంటూ వచ్చేవికావా? అన్నారు. ప్రధాని గజ్వేల్‌కు వచ్చినప్పుడు.. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయహోదా కల్పించాలని స్వయంగా సీఎం కేసీఆర్ విన్నవిస్తే.. మోదీ ముసిముసి నవ్వులు నవ్వి వెళ్లిపోయారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌తో ఏమైతదని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందుకూడా ఇలాగే మాట్లాడి 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారని ఎద్దేవాచేశారు. దేశంలో చాలా రాష్ర్టాల్లో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉన్నదన్నారు.

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని కేటీఆర్ వివరించారు. రైతుబంధు పథకాన్ని పొరుగునే ఉన్న ఏపీతోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. దేశంలో ఏ సీఎంకు ఇలాం టి ఆలోచనే రాలేదన్నారు. ఆఖరుకు ప్రధాని మోదీ కూడా ఈ పథకాన్ని కాపీ కొట్టారని చెప్పారు. ఈ పథకంద్వారా దేశంలో 13 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారంటే అది కేసీఆర్ వల్లేనని స్పష్టంచేశారు. గతంలో బెంగా ల్ ఏం ఆలోచిస్తే దేశం అదే ఆలోచిస్తుందనే వారని, కానీ.. ఇప్పుడు అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అనేక రాష్ర్టాల్లో బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలకే ప్రజలు పట్టంకడుతున్నారని, వాటిని గుండెలకు హత్తుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణలో 16 సీట్లను టీఆర్‌ఎస్, ఒక సీటు ను ఎంఐఎం గెలువబోతున్నదని రిపబ్లిక్ టీవీ గురువారం సర్వేలో చెప్పిందన్నారు. ఆయా సభల్లో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు సీహెచ్ మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, మహిపాల్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌రెడ్డి, మండలి విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, శంభీపూర్‌రాజు, కర్నె ప్రభాకర్, జనార్దన్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భూపతిరెడ్డి, బాలమల్లు, రాకేశ్‌రెడ్డి, తా డూరి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎగ్గె మల్లేశం, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నేతలు బండి రమేశ్, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నరేంద్రనాథ్, దేవేందర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాధాకృష్ణశర్మ, కేఎం ప్రతాప్, నవీన్‌రావు, నారెడ్డి నందారెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, రాజనర్సు, భాస్కర్, మేడ్చల్ జెడ్పీటీసీ శైలజ, టీఆర్‌ఎస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బావ బావమరుదుల సవాల్ కాదు.. ముఖ్యమంత్రిగారితోనే పోటీ! రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎవరూ ప్రత్యర్థులు లేరని కేటీఆర్ అన్నారు. పోటీ ఉన్నదల్లా టీఆర్‌ఎస్ మధ్యేనని చెప్పారు. కరీంనగర్, వరంగల్ అభ్యర్థులను దాటి మెదక్ ఎంపీ అభ్యర్థిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించుకుంటామని మెదక్ సభలో హరీశ్‌రావు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం కరీంనగర్‌లోనే ఉందన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కంటే కరీంనగర్ నుంచి ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటామంటూ మెదక్ నేతలకు స్నేహపూర్వక సవాలు విసిరారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న కొందరు నేతలు.. బావా బావమరుదుల సవాల్ అనడంతో.. బావ బావమరుదులు కాదు.. నేరుగా ముఖ్యమంత్రిగారితోనే.. బావ బావమరుదులకేంగాదు.. అంతమంచిగనే ఉన్నాం అని కేటీఆర్ అనడంతో సభ చప్పట్లతో మారుమోగింది. డైరెక్టుగా నేను గజ్వేల్ నాయకులకే సవాలు విసురుతున్నా. మీరు చెప్పినదాన్నిబట్టి ఏడు లక్షల మెజార్టీ రావాలి.. మరి ఏడొస్తదా? ఐదొస్తదా? మాకంటే ఒక ఓటు ఎక్కువొస్తదా? తక్కువొస్తదా? మేం కూడా చూసుకుంటం. (ఈ సందర్భంగా సోలిపేట రామలింగారెడ్డి కేటీఆర్‌నుద్దేశించి షరతు కడుదామా? అనడంతో..) ఇగ లింగన్నైతే షరతులకే అంటున్నడు. లాభం లేదు.. మేంగూడ సవాలు తీసుకుంటం అని కేటీఆర్ అనడంతో సభ మరోసారి నవ్వులతో నిండిపోయింది.

దివాలాకోరు పార్టీగా మారిన కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? కాంగ్రెస్.. స్కాముల పార్టీ. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవు. నాకు రాజకీయంగా జన్మనిచ్చిన మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. -మంత్రి చామకూర మల్లారెడ్డి

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, మరికొన్ని పార్టీల నాయకులు అలీబాబా అరడజన్ దొంగల్లా ప్రచారానికి వస్తే వారికి ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పారు. జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఫలితాలతో ప్రతిపక్ష నేతలు తెలంగాణ వదిలి పారిపోయారు. మళ్లీ మాయకూటములొచ్చే అవకాశం ఉంది. అలాంటివాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ మహాత్ముడు. తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ సారథ్యంలో గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 99 సీట్లు,అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచాం. పార్లమెంట్ ఎన్నికలలో కేటీఆర్ నాయకత్వంలో 16 స్థానాలను గెలుస్తాం. -మంత్రి మహమూద్ అలీ

రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే అది ఒక్క టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలతో పోటీలేదు. ఇతర పార్లమెంట్ స్థానాల్లో వచ్చే మెజార్టీతోనే పోటీ. వరంగల్, కరీంనగర్ కంటే మెదక్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుని, సీఎం కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దాం. -మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

అన్ని వర్గాల ప్రజల కండ్లల్లో ఆనందం నింపినప్పుడే అది ప్రజల ప్రభుత్వంగా కీర్తిపొందుతుందని సీఎం కేసీఆర్ నాతో చెప్తుంటారు. ఈ క్రమంలోనే అన్నివర్గాల ప్రజల అభ్యన్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నారు. -టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.