Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

హద్దు మీరితే తొక్కేస్తాం.. ప్ర‌తిప‌క్షాల‌కు ఘాటు హెచ్చ‌రిక‌

-తలుచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు
-తెలంగాణను అరిగోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది
-మమ్ముల్ని ఢిల్లీవోడో.. ఇంకోడో నామినేట్‌ చేయలే
-ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రభుత్వం మాది
-హాలియా సభలో సీఎం కేసీఆర్‌

హద్దుమీరితే తొక్కేస్తాం.. మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికా రం ఇచ్చారని.. ఏ ఢిల్లీవోడో నామినేట్‌ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదని పేర్కొన్నారు. ఏండ్లు గా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని చెప్పారు. రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా పదవులు, పైరవీల కోసం నోరు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్‌ డ్యాంను 19 కిలోమీటర్లపైన నిర్మిస్తే నేడు నల్లగొండ జిల్లాలో ఇన్ని లిఫ్ట్‌లు నిర్మించుకోవాల్సిన దుస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా హాలియా సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

తెలంగాణ దుస్థితికి కారణమెవరు?
తెలంగాణను నాశనంచేసిందెవరు? నాటి దుస్థితికి కారణమెవరు? ఎవరు చెడగొట్టా రు?ఎవరు కరువు పాల్జేశారు? దీన్ని మొత్తం ఎవరు దెబ్బకొట్టారో ప్రజానీకం అంతా ఆలోచించాలి. అనేక భాషలు, మతాలు, విభిన్న సంస్కృతితో గొప్పగా ఉన్న హైదరాబాద్‌ రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్‌వాళ్లు కాదా? మూడు ముక్కల్లో ఓ ముక్కను మహారాష్ట్రలో, ఇంకో ముక్క ఆంధ్రాలో, మరో ముక్కను కర్ణాటకలో కలిపిన దుర్మార్గులు వారు. చారిత్రక తప్పిదాలకు కారకులెవరు? రైతులు చచ్చిపోయే దుర్భర పరిస్థితి తెచ్చిందెవరన్నది ఒకసారి ఆలోచించాలి.

రాబందుల కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ ముఖానికి ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచించారా? రాబందుల్లా వ్యవహరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారికోసం ఏమీ చేయలే. కానీ, నేడు ఏడాదికి రైతులకు రైతుబంధు కింద రూ. 15 వేల కోట్లిస్తున్నాం. ఠంచన్‌గా బ్యాంకులో పడి మూడు మూడు మెసేజ్‌లు వస్తున్నాయా? లేదా? కాంగ్రెస్‌ హయాంలో ఐదొందలొస్తే అందులో 250 కమిషన్‌ ఇయ్యాలె. గీకాలె.. గోకాలె.. మనం దరఖాస్తు పెట్టాలె. దండాలు గట్టాలె. అయ్యగారికి.. ఆఫీసర్‌ గారికి.. ఆఖరికి అటెండర్‌కి కూడా ఇయ్యాలె. సగం మింగేది. ఇయ్యాల ఐదువేలు కేసీఆర్‌ అక్కడ వేస్తే అవి మీ బ్యాంకులకు నేరుగా జమవుతున్నయా? లేదా? ఇదీ టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌. ఇదీ క్లీన్‌ గవర్నమెంట్‌. ఇది అవినీతిరహితమైన గవర్నమెంట్‌. ఈ పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నరు.

పాదయాత్ర చేసినా పట్టించకోలే
2003లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసినం. ఇక్కడి సమస్యలను హైలెట్‌ చేసినం. కానీ ఏ కాంగ్రెస్‌ నాయకుడూ ముందుకొచ్చి మాట్లాడలే. వీళ్ల నిష్క్రియాపరత్వం ఎంతదూరం ఉన్నదంటే.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని శాసనసభలో టీఆర్‌ఎస్‌ నాయకులు అడుగుతుంటే ‘ఎక్కువ తక్కువ మాట్లాడితే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ. ఏం చేసుకుంటవో చేసుకోపో’ అని అన్న డు. అట్లెట్ల మాట్లాడుతవ్‌ ముఖ్యమంత్రీ అని ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా అడగలే. నల్లగొండకు లిఫ్ట్‌లు, ప్రాజెక్టులు మంజూరు చేస్తే కమీషన్ల కోసం చేసిన్రని అంటున్నరు. మిషన్‌ కాకతీయను కమీషన్‌ కాకతీయ అంటున్నరు. మరి మీరు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టిన్రా? దాన్ని ఒప్పుకుంటరా?. మేము నీతితో, నిబద్ధతతో, అవినీతిరహితంగా పాలన అందిస్తూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతుంటే.. రైతులకు నీళ్లిస్తుంటే.. కండ్లు మం డిపోయి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతున్నారు. వారికి సమాధానం చెప్పాలని కోరుతు న్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉంటే మంచిది కాదు.

ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించిందెవరు?
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ భూతం ఒక తరా న్నే నాశనం చేసింది. లక్షాయాభైవేల మంది జీవితాలను పొట్టన పెట్టుకున్నది. అయినా ఒక్కడన్నా మాట్లాడిండా? కొట్లాడిండా? ఉద్యమా లు చేసిండా? వాళ్లు చేయకపోగా.. చేసినవాళ్లను అవమానపరిచిన్రు. ఇక్కడ ఉద్యమకారులు ఫ్లోరైడ్‌ సోకిన బిడ్డలను తీసుకెళ్లి నాటి ప్రధాని వాజపేయి టేబుల్‌ మీద పడుకోబెడితే కూడా మాట్లాడిన దిక్కులేదు. బొక్కలు వంకరపోయినా, నడుములు వంగిపోయినా పట్టించుకోలే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వందశాతం ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టినం. మంచినీళ్లు అందించినం. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినం. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక చంద్రబాబు హయాంలో రైతులు పంటలు వేసుకున్నంక సడన్‌గా కాలువ బంద్‌ చేసిన్రు. మిత్రుడు విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆరోజు నేనే స్వయంగా నాగార్జునసాగర్‌ కట్టమీదికి వచ్చిన. 50 వేల మందితో మీటింగ్‌ పెట్టి, ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చి తెల్లారేసరికి నీళ్లు తెచ్చినం. ఆనాడు చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. ఇయ్యాల సాగ ర్‌ నుంచి మన వాటానీళ్లు తీసుకుంటున్నం. కొట్లాడి రెండు పంటలకు నీళ్లు తెస్తున్నం.

ముంచిన చరిత్ర కాంగ్రెస్‌ది
వాళ్లు అన్నీ ముంచుకొచ్చిన్రు. విజయా డైయిరీ ముంచితే నోరు తెర్వలే. ఒక్క రూపాయి ఇయ్యలే. మళ్లీ ఇప్పుడు విజయా డైయిరీని పునరుద్ధరించినం. ఆదిలాబాద్‌ ముద్దుబిడ్డ లోక భూమారెడ్డి విజయాడైయిరీ చైర్మన్‌గా బ్రహ్మాండంగా నడిపిస్తున్నరు. నిన్నటిదాకా రైతులకు లీటరుకు రూ.4 ఇన్సెంటివ్స్‌ ఇచ్చినం. ఇప్పుడు మల్లొక రూపాయి పెంచిన్రు. ఇదీ టీఆర్‌ఎస్‌ పరిపాలన. ఇదీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. మిషన్‌ కాకతీయ ద్వారా 45వేల చెరువులు పునరుద్ధరించుకుంటే ఇయ్యాల భూగర్భ జలాలు పెరుగలేదా? గతంలో కరంటు ఎప్పుడు వస్తదో ఎవరికీ తెల్వదు. రోజూవేల మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, లంచాలివ్వడం, పంటలు పండుతయో.. ఎండుతయో తెల్వకపోవడం.. ఇవన్నీ బాధలు అనుభవించినం. ఈ రోజు దేశంలోనే రైతాంగానికి 24 గంటలపాటు ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇయ్యాల ఎఫ్‌సీఐకి దేశంలోనే అత్యధిక వడ్లు ఇస్తున్నం. తెలంగాణలో 30 లక్షల ఎకరాలున్న వరిసాగు 1.10 కోట్ల ఎకరాలకు చేరింది.

పొలంబాట ఎందుకు?
ఎందుకు చేయాలె పొలంబాట.. పోరుబాట? పొలానికి ఏమైంది? పిచ్చిపిచ్చి పనులు బంద్‌ చేయాలె. బుద్ధిమంతుల్లా ఉండాలె. మాకు అధికారం ప్రజలిచ్చిండ్లు. ఢిల్లీవోడో.. ఇంకోడో నామినేట్‌ చేసిన ప్రభుత్వం కాదిది. రైతులకు రైతుబంధు, రైతుబీమా వస్తున్నందుకా? ఉచిత కరంటు వస్తున్నందుకా? మంచి గ పంటలు పండుతున్నందుకా? మీ కాలంలో ఏదీ లేదు. మీరు ఎరువులు కూడా ఇయ్యలే. కల్తీ విత్తనాలు ఇచ్చి ఇంట్ల పండుకున్నరు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదు. రైతు సచ్చిపోతే ఆపద్బందు అని చెప్పి రూ.50వేలు ఇచ్చి చేతులు దులుపుకొనేది. కానీ ఈ రోజు గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా వారంలోపలే రూ.5 లక్షలు వారి ఖాతాల్లో జమ అయితున్నయి. కాంగ్రెస్‌ నేతలు అన్నీ లంగ మాటలు..పటంగి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నరు. అన్నీ గమనించాలి.

నాడే నోరువిప్పి ఉంటే
గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? అన్నది కూడా అంతా ఆలోచించాలి. నాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎవరూ ప్రశ్నించలే. ఇప్పుడున్న సాగర్‌ ప్రాజెక్టు అసలు కట్టాల్సింది 19 కిలోమీటర్లపైన ఏలేశ్వరం గ్రామం దగ్గర. కానీ నాడున్న దుర్మార్గుడు కేఎల్‌రావు, ఇతర నాయకులు కుట్రలు చేసి నీళ్ల వాటాలు తగ్గించి 19 కిలోమీటర్ల కిందికి తెచ్చిండ్రు. ఏలేశ్వరం దగ్గర్నే కట్టి ఉంటే ఇవాళ శంకుస్థాపన చేసిన లిఫ్ట్‌లు నిర్మించుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే, పాలేరు కాలువ వంకర తిప్పి ఖమ్మం జిల్లా రైతుల నోట్లో మట్టికొడుతుంటే మీరంతా యాడపన్నరు.

ముల్లును పొల్లుపొల్లు చేస్తం
ఈ మధ్యల బీజేపీ పార్టీ వాళ్లు కొత్త బిచ్చగాండు పొద్దెరగడు అన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. మీలాగా మేం మిడిసిపడాలంటే, మీలాగా మాట్లాడడం మాకు చేతగాక కాదు. మీరు ఇక్కడికి వచ్చినోళ్లు పిడికెడు మందిలేరు. మేం ఎంతమంది ఉన్నం. మేం తలుసుకుంటే మీరు నశం కూడా మిగలరు. దుమ్మదుమ్మయిపోతరు. మీకు(బీజేపీ) ముల్లు ఎక్కువ ఉందంటే ఆ ముల్లును పొల్లుపొల్లు చేసి తీరతం జాగ్రత్త. ఇక్కడెవరూ చేతులు ముడుచుకుని కూర్చోరు. ఈ పిచ్చిపనులు బంద్‌ చేసుకుంటే మంచిది. వాళ్ల పార్టీలు, వాళ్ల నాయకత్వాలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిక చేస్తున్న. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మేం చాలామంది రాకాసులతోనే కొట్లాడినం. ఈ గోకాశులు మాకు గోసికింద కూడా లెక్కకాదు. తొక్కిపడేస్తం జాగ్రత్త. ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్‌ చేసుకోవాలి. లేకపోతే దారుణంగా నష్టపోతరు. మీరు చేసే పిచ్చిపనులకు ఇక్కడ ఎవరు డిస్ట్రబ్‌ కారు.

-హద్దుమీరితే తొక్కేస్తాం. మేం తలచుకుంటే బీజేపీ నాయకులు దుమ్ముదుమ్మైపోతరు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. ఏ ఢిల్లీవోడో నామినేట్‌ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదు.
-ఈ మధ్యల బీజేపీ పార్టీ వాళ్లు కొత్త బిచ్చగాండ్లు పొద్దెరగడు అన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. మీలాగా మేం మిడిసిపడాలంటే, మీలాగా మాట్లాడడం మాకు చేతగాక కాదు. మీరు ఇక్కడికి వచ్చినోళ్లు పిడికెడు మందిలేరు. మేం ఎంతమంది ఉన్నం. మేం తలుసుకుంటే మీరు నశం కూడా మిగలరు. దుమ్మదుమ్మయిపోతరు. మీకు ముల్లు ఎక్కువ ఉందంటే ఆ ముల్లును పొల్లుపొల్లు చేసి తీరతం జాగ్రత్త. ఇక్కడెవరూ చేతులు ముడుచుకుని కూర్చోరు.
-ఈ పిచ్చిపనులు బంద్‌ చేసుకుంటే మంచిది. మీ పార్టీలు, నాయకత్వాలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిక చేస్తున్న. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరిననాడు ఏం చేయాల్నో మాకు తెలుసు. మేం చాలామంది రాకాసులతోనే కొట్లాడినం. ఈ గోకాశులు మాకు గోసికింద కూడా లెక్కకాదు. తొక్కిపడేస్తం జాగ్రత్త.
-తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్‌. ఏండ్లుగా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదు. రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా పదవులు, పైరవీల కోసం నోరు మూసుకున్నారు. సాగర్‌ డ్యాంను 19 కిలోమీటర్లపైన నిర్మిస్తే నేడు నల్లగొండ జిల్లాలో ఇన్ని లిఫ్ట్‌లు నిర్మించుకోవాల్సిన దుస్థితి ఉండేది కాదు.
-తెలంగాణను నాశనంచేసిందెవరు? నాటి దుస్థితికి కారణమెవరు? ఎవరు చెడగొట్టారు?ఎవరు కరువు పాల్జేశారు? దీన్ని మొత్తం ఎవరు దెబ్బకొట్టారో ప్రజానీకం అంతా ఆలోచించాలి. అనేక భాషలు, మతాలు, విభిన్న సంస్కృతితో గొప్పగా ఉన్న హైదరాబాద్‌ రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్‌వాళ్లు కాదా?
-కాంగ్రెస్‌ పార్టీ ముఖానికి ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచించారా? రాబందుల్లా వ్యవహరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారికోసం ఏమీ చేయలే. కానీ, నేడు ఏడాదికి రైతులకు రైతుబంధు కింద రూ.15 వేల కోట్లిస్తున్నాం.
-2003లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసినం. ఇక్కడి సమస్యలను హైలెట్‌ చేసినం. కానీ ఏ కాంగ్రెస్‌ నాయకుడూ ముందుకొచ్చి మాట్లాడలే. వీళ్ల నిష్క్రియాపరత్వం ఎంతదూరం ఉన్నదంటే.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని శాసనసభలో టీఆర్‌ఎస్‌ నాయకులు అడుగుతుంటే ‘ఎక్కువ తక్కువ మాట్లాడితే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వ. ఏం చేసుకుంటవో చేసుకోపో’ అని అన్నడు. అట్లెట్ల మాట్లాడుతవ్‌ ముఖ్యమంత్రీ అని ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా అడగలే.
-నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ భూతం ఒక తరాన్నే నాశనం చేసింది. లక్షాయాభైవేల మంది జీవితాలను పొట్టన పెట్టుకున్నది. అయినా ఒక్కడన్నా మాట్లాడిండా? కొట్లాడిండా? ఉద్యమాలు చేసిండా? వాళ్లు చేయకపోగా.. చేసినవాళ్లను అవమానపరిచిన్రు.
– సీఎం కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.