-నియామక ఫైల్‌పై సంతకం చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -15వ తేదీలోగా భర్తీ ప్రక్రియ పూర్తి -రెండుమూడు రోజుల్లో మార్గదర్శకాలు: పాఠశాల విద్యాశాఖ

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. అందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం మంగళవారం సంతకం చేశారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,974 ఉపాధ్యాయ ఖాళీలను విద్యా వాలంటీర్లతో భర్తీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నది. ఈ నెల 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిరంజీవులు తెలిపారు. వీరికి నెలకు రూ.8,000 వేతనం చెల్లించనున్నట్లు చెప్పారు. డిగ్రీతోపాటు బీఎడ్ కోర్సు పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రెండుమూడు రోజులలో విడుదల చేస్తామని వెల్లడించారు.