-ప్రగతి పథం.. సంక్షేమ రథం -సబ్బండవర్ణాల ప్రగతే లక్ష్యం.. ఉద్యోగ అవకాశాలు పెంచాం -ఆర్థిక క్రమశిక్షణ.. రూ.2.28 లక్షలకు తలసరి ఆదాయం -కరోనాపై సమర్థ పోరు.. విప్లవాత్మక విద్యుత్తు సంస్కరణలు -భగీరథతో ఫ్లోరైడ్ పరార్.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి -ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై

‘సంపద పెంచాలి – పేదలకు పంచాలి’ అనే స్ఫూర్తితో.. పెరుగుతున్న ఆదాయాన్ని పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఉపయోగిస్తున్నది. 39,36,521 మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. ఇందుకు ఏటా రూ.8,710 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పల్లె ప్రగతిద్వారా ప్రతి గ్రామంలో అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది. కులవృత్తులకు ప్రోత్సాహంలో భాగంగా గొర్రెల పంపిణీ, చేపల పెంపకం చేపట్టింది. నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి యూనిఫారాల వస్త్రాన్ని, పండుగలకు పంచే చీరెలు, దుస్తులను నేతల కార్మికుల సొసైటీల నుంచే కొనుగోలు చేస్తున్నాం. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదనడానికి పట్టణీకరణ ప్రబల నిదర్శనం.
అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రశంసించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన తమిళిసై.. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రయాణం సాగిస్తున్నదని చెప్పారు. వివిధ అంశాల్లో అద్భుతాలు సృష్టించి దేశానికి దారిచూపే మార్గదర్శి (టార్చ్ బేరర్) గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాహ్య, అంతర్‌శక్తులు కుయుక్తులతో తెలంగాణ ప్రగతిని అడ్డుకొనే ప్రయత్నాలు చేసినప్పటికీ.. సవాళ్లకు ఎదురొడ్డి.. నిటారుగా నిలిచామని, మన అస్తిత్వాన్ని విస్మరించలేని స్థితికి తీసుకొనిపోయి.. ప్రత్యర్థులకు దీటైన సమాధానం ఇచ్చామన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్రం గెలిచి నిలిచిందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో నిలువటం.. ఇక్కడ జరుగుతున్న ప్రగతికి ప్రబల నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికీ హృదయం ద్రవిస్తుందని చెప్పారు. ఇవాళ ఇంత ఉన్నతస్థితికి చేరుకోవడానికి ఆరున్నరేండ్లకు పైగా రేయింబవళ్ల కృషి.. కొన్ని వేల గంటల మథనం దాగి ఉన్నదని గుర్తుచేశారు. ‘ఏ గుడ్ ప్లాన్ ఈజ్ ఏ సక్సెస్ ఆఫ్ డన్, ఎండ్ టు ఎండ్ ప్లానింగ్, పర్‌ఫెక్ట్ ఎగ్జిక్యూషన్’.. ఈ మూడింటితోనే తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించామని చెప్పారు.
ఆర్థిక క్రమశిక్షణ మనిషి కేంద్రంగా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం తనదైన అభివృద్ధి నమూనాను రూపొందించుకున్నదని గవర్నర్ అన్నారు. వనరులు- అవసరాలను బేరీజు వేసుకొని ముందు కు వెళ్తున్నామని చెప్పారు. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంపొందించుకుంటున్నామని తెలిపారు. 2014- 2019 వరకు 17.24 శా తం సగటు వార్షిక వృద్ధి రేటుతో ఆదాయాన్ని పెంచుకుంటూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని వెల్లడించారు. 2013-14లో తలసరి ఆదాయం రూ. 1.12 లక్షలు ఉండగా 2019-20 నాటికి రూ.2.28 లక్షలకు పెరిగిందన్నారు. పెరిగిన ఆదాయాన్ని జాగ్రత్తగా అభివృద్థి, వికాసానికి ఖర్చుచేస్తున్నామన్నారు.
ఫోరైడ్ రహిత రాష్ట్రంగా.. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించి రాష్ర్టాన్ని ఫ్లోరైడ్ రహితంగా తీర్చిదిద్దామని గవర్నర్ చెప్పారు. ఈ పథకం దేశానికి ఆదర్శంగా మారిందని, గత పాలకులు 60 ఏండ్లలో సాధించలేనిది.. తన ప్రభుత్వం అతి తక్కువ కాలంలో సాధించిందని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయరాజులు నిర్మించిన 45 వేల పురాతన చెరువులను పునరుద్ధరించే మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేశామని, దీంతో భూగర్భ జలాలు పైకొచ్చాయని, చేపల పెంపకం జోరందుకున్నదని పేర్కొన్నారు. నదీజలాల వినియోగంపై ప్రత్యేక దృష్టిసారించి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేశామని.. 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రీ డిజైన్‌చేసి, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకొని కాళేశ్వరం నిర్మించుకొన్నామని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఒకనాడు కరువుకాటకాలకు చిరునామాగా మారిన తెలంగాణ, ఇవాళ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని గవర్నర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 1.41 కోట్ల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేయగలిగితే.. నేడు ఏడాదికి 2.10 కోట్ల ఎకరాల భూమిలో పంటలు పండిస్తున్నామని పేర్కొన్నారు. 1.04 కోట్ల ఎకరాల్లో వరి సాగయిందని, పత్తిసాగులో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా ద్వారా అన్నదాతలకు అండగా నిలిచామని చెప్పారు.

పారదర్శకంగా సేవలు అవినీతికి, జాప్యానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చిందని గవర్నర్ తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంతో, ధరణి పోర్టల్‌తో భూ పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని చెప్పారు. గురుకుల విద్యాలయాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, మన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని కొనియాడారు. ప్రసవ సమయంలో గర్భిణులు కోల్పోయే వేతనాన్ని భర్తీచేసేందుకు రూ.12 వేల నగదు, రూ.4 వేల విలువైన వస్తువులతో కేసీఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. నాలుగు కొత్త వైద్యకళాశాలలతో ఎంబీబీఎస్ సీట్లు 1640, పీజీ సీట్లు 835కి పెరిగాయని వెల్లడించారు. ‘బెటర్ కనెక్టివిటీ లీడ్స్ టు బెటర్ సొసైటీ’ అన్న సూత్రాన్ని అనుసరించి రహదారుల వ్యవస్థను మెరుగుపర్చేందుకు సమగ్ర విధానాన్ని అమలు చేశామన్నారు. జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు లేన్లు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండులేన్లు.. ప్రతి గ్రామానికి కచ్చితంగా రోడ్డు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకొన్నామని చెప్పారు. ఎంతో పట్టుదలతో కేంద్రం ద్వారా రీజినల్ రింగ్‌రోడ్డును సాధించామని.. త్వరలోనే భూసేకరణ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించే లక్ష్యంతో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతున్నదని చెప్పా రు. రాష్ట్రంలో గత ఆరున్నరేండ్లలో దాదాపు 3.76% పచ్చదనం పెరిగిందని ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రకటించడం తెలంగాణకు హరితహారం సాధించిన విజయమన్నారు. తెలంగాణ పోలీసులు నిర్దిష్ట విధులకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక విధులు కూడా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో మన పోలీసుల సేవలు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న మాటకు నిజమైన నిర్వచనంగా మారాయని తెలిపారు.
కరోనా నుంచి వేగంగా కోలుకున్నాం కరోనా పరిస్థితులు రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్ర భావం చూపినా, ఎప్పటికప్పడు తగిన వ్యూహాలు రూపొందించుకుంటూ.. మరీ దిగజారి పోకుండా కాపాడుకోగలిగామని గవర్నర్ అన్నారు. కరోనా సంక్షోభం నుంచి అతి త్వరగా కోలుకున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని భారత ఆర్థిక సర్వే 2021 ప్రశంసించడం మన ఆర్థిక నిర్వహణాదక్షతకు దక్కిన గుర్తింపని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నదని, రాష్ట్రా న్ని కరోనా నుంచి కాపాడేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్లు సాహసోపేతంగా, అద్భుతంగా కృషిచేశార ని ప్రశంసించారు. విద్యుత్తురంగంలో దేశమే నివ్వె ర పోయేంతగా అద్వితీయ విజయాలను తెలంగా ణ సాధించిందని అన్నారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నామని చెప్పా రు. జాతీయ సగటుకంటే విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువైందని, విద్యుత్ సంస్కరణలపై రా ష్ర్టాన్ని కేంద్రం ప్రశంసించిందని గుర్తుచేశారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు ‘సంపద పెంచాలి – పేదలకు పంచాలి’ అనే స్ఫూర్తితో.. పెరుగుతున్న ఆదాయాన్ని పెద్ద మొ త్తంలో సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నదని, 39,36,521 మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని గవర్నర్ చెప్పారు. ఇందుకు ఏటా రూ. 8,710 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. పల్లె ప్రగతిద్వారా ప్రతి గ్రామంలో అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు వివరించారు. కులవృత్తుల ప్రో త్సాహంలో భాగంగా గొర్రెల పంపిణీ, చేపల పెంప కం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఏడాది మరోవిడత గొర్రెల పంపిణీ చేపడతామని తెలిపారు. నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి పోలీసులు, విద్యార్థుల యూనిఫారాల బట్టను, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్‌కు పంపిణీచేసే చీరెలు, దు స్తులను నేతల కార్మికుల సొసైటీల నుంచే కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రగతి నిధి చట్టం తెచ్చి అమలుచేస్తున్నామని, మరిన్ని నిధులు కేటాయించాలని నిర్ణయించామని గుర్తుచేశారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదనడానికి పట్టణీకరణ ప్రబల నిదర్శనమని చెప్పారు.
టీఎస్‌ఐపాస్‌తో పరిశ్రమలకు ఉత్తేజం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి ఉత్తేజాన్నిచ్చిన టీఎస్‌ఐపాస్ యావత్ ప్రపంచం ప్రశంసలు అందుకొన్నదని, సులభ వాణిజ్య విధానంలో మొదటి మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని గవర్నర్ అన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా 15 వేల పరిశ్రమలు అనుమతులు పొందగా.. వాటిద్వారా 2.13 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని, 15.51 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. టీ హబ్.. ఎన్నో స్టార్టప్‌లకు ఆధారమైందని, 250 ఐటీ కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతుల విలువ రూ.1,28,807 కోట్లకు చేరిందన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చి స్థిరపడ్డ ప్రజలతో హైదరాబాద్ నిజమైన కాస్మొపాలిటన్ సిటీగా మారిందని చెప్పారు. తెలంగాణ మొదటినుంచి మత సామరస్యానికి, సహజీవనానికి పెట్టింది పేరన్నారు. నాడు ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణ నేడు జీవకళతో తొణికిసలాడుతున్నదన్నారు. తన ప్రభుత్వం ప్రజాసేవకు పునరంకితం అవువుతుందన్నారు. ప్ర స్తుత తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు.. తమిళకవి తిరువళ్లువార్ రచించిన తిరుక్కురల్ లోని పద్యా ల్లో వాస్తవంగా ప్రతిబింబిస్తున్నాయని చెప్తూ.. గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు.