రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్ దేశంలోనే ఓ నమూనా కానుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.

భవిష్యత్తులో వివిధ రాష్ర్టాలు తాగునీటి సరఫరా వ్యవస్థల నమూనాల అధ్యయనానికి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేలా వాటర్‌గ్రిడ్‌ను రూపొందిస్తామని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్-ఇన్-చీఫ్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్‌ను సమర్థంగా, సకాలంలో పూర్తిచేస్తామని, ఇందుకు ఆర్థిక సహకారం అందించేందుకు జైకా వంటి పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్పారు. వాటర్‌గ్రిడ్ పనుల నిర్వహణ బాధ్యతలను అనుభవం, అర్హతలున్న సంస్థలకే అప్పగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
-చేయూతకు జైకావంటి సంస్థల ఆసక్తి -అర్హతలున్న కంపెనీలకే పనుల్లో అవకాశం -వాటర్‌గ్రిడ్ సమీక్షలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేరకు సాధ్యమైనంత మేరకు గ్రావిటి ఆధారంగా, విద్యుత్‌ను పొదుపుచేసే విధంగా తమ గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఇంజినీర్లు వాటర్‌గ్రిడ్ డిజైన్లు రూపొందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో జాతీయ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కలిసి తెలంగాణ వాటర్‌గ్రిడ్ కోసం నిధులు అడిగామని, రానున్న బడ్జెట్‌లో కేంద్రం నిధులు ఇచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు సవ్యంగా ముందుకు సాగాలంటే భారీ ప్రాజెక్టులను పూర్తిచేయగలిగే సత్తా, సామర్థ్యంతోపాటు అన్ని ప్రమాణాలున్న సంస్థలకు పనులు అప్పగించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, కేవలం కాంట్రాక్టుల కోసం మాత్రమే నడిచే కంపెనీలకు ప్రాజెక్టు పనుల్లో అవకాశాలివ్వకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు పలు చర్యలు చేపట్టనున్నట్లు,మొబిలైజేషన్ అడ్వాన్సు, టెండర్లలో విపరీతమైన మార్పులు వంటి గత ప్రభుత్వాల విధానాలను పక్కనబెట్టి టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాల్లో సర్వే పనులు మరింత వేగంగా జరిపేందుకు, వాటర్‌గ్రిడ్‌కు కావాల్సిన స్థల సేకరణ చేపట్టేందుకు జిల్లా వాటర్‌గ్రిడ్ అధికారులకు కోటి రూపాయల వరకు వెంటనే కేటాయించాలని అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు.
వేగంగా పంచాయతీరాజ్ రోడ్ల పనులు.. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలో చేపట్టిన రోడ్ల పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈఎన్‌సీతోపాటు పలువురు అధికారులు రోడ్ల పనులకు సంబంధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. ఎంఎంఆర్ (బీటీ రెన్యువల్స్) పనుల్లో భాగంగా చేపట్టిన 433 ప్యాకేజీల్లో 90శాతం ప్యాకేజీలకు టెండర్లు పూర్తయినట్లు, సుమారు రూ.1310 కోట్ల రూపాయల పనులకు టెండర్లు వస్తే దాదాపు రూ.600కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్-ఇన్-చీఫ్ సురేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు బాబూరావు, చక్రపాణి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.