Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఢిల్లీలో చక్రం తిప్పేది కేసీఆరే..

-16 ఎంపీ సీట్లను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలి..
-గరీబీ హఠావోపై రాహుల్ క్షమాపణ చెప్పాలి
-టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాల్లో మంత్రులు, ఎంపీలు, పార్టీ అభ్యర్థులు

దేశానికి ప్రధానిని నిర్ణయించేవి మన 16 సీట్లేనని, వాటిని టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుచుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించారు. ఇద్దరు ఎంపీలతో రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్‌కు ఈ దఫా 16 మంది ఎంపీలను గెలిపిస్తే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారన్నారు. జాతీయ పార్టీలకు మెజారిటీ వచ్చే పరిస్థితులు లేవని, అనేక రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని చెప్పారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సచ్చిపోయిందన్నారు. గరీబీ హఠావో నినాదంతో దేశ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధిచెప్పాలని సూచించారు. గురువారం ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో వారు మాట్లాడారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు అనేక పార్టీలు చూస్తున్నాయని, 16 స్థానాలను గెలిపించి ప్రధానిని నిర్ణయించే శక్తి కేసీఆర్‌కు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

రాహుల్ క్షమాపణ చెప్పాలి: హరీశ్
గరీబీ హఠావో నినాదంతో దేశ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రయత్నిస్తున్నారని మాజీ మం త్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా వెలిమెల గ్రామంలో నిర్వహించి న పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1971లో రాహుల్‌గాంధీ నాయ నమ్మ ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంతో ముం దుకెళ్లారని, తర్వాత 1989లో రాజీవ్‌గాంధీ అదే నిదానంతో అధికారం చేపట్టారని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా పేదవాళ్లు పేదరికంలోనే ఎందుకు ఉన్నారో రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందుగా క్షమాపణ చెప్పాలన్నారు. నిజమైన పేదరిక నిర్మూలన చేపడుతుంది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు ఖాయమైందని, భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి: రంజిత్‌రెడ్డి
కేంద్రాన్ని శాసించాలంటే 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించాలని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి, దోమ, నవాబుపేట్ మండలాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. సమావేశాల్లో పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య పాల్గొన్నారు.

బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
ఎమ్మెల్యే గంప గోవర్ధన్
టీఆర్‌ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్య ర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారు. కామారెడ్డిలోని సత్య గార్డెన్‌లో గురువారం టీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని కార్యకర్తలకు సూచించారు. ఏప్రిల్ మూడున అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే కేసీఆర్ సభకు భారీఎత్తున కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరావు, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ సచ్చిపోయింది: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో కాంగ్రెస్ సచ్చి పోయిందని, నాయకత్వం కరువైందని, ఢిల్లీలో ఆ పార్టీ చేతులెత్తేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం వరంగల్, హన్మకొండ, వరంగల్ రూరల్‌జిల్లా నర్సంపేట, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లలో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ బండా ప్రకాశ్, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ సత్యవతి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

గల్లీలో గెలువని వారిని ఢిల్లీకి పంపొద్దు: శ్రీనివాస్‌రెడ్డి
గల్లీలో గెలువని వారిని ఢిల్లీకి పంపొద్దని మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని విజన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎక్పైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారిని ఇప్పుడు పార్లమెంట్‌కు ఎలా పంపుతారని, వారిని పూర్తిగా తిరస్కరించాలని కోరారు.

సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన జరిగిన కాటారం, మహాముత్తారం మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, దేశానికి ఆయన నాయకత్వం ఎంతో అవసరమందని అన్నారు. పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అందరికీ అండగా ఉండి సేవ చేస్తానన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.